హోమ్ /వార్తలు /క్రైమ్ /

యజమానితో వివాదం.. 61 సిలిండర్లను ఎత్తుకెళ్లిన దుండగుడు

యజమానితో వివాదం.. 61 సిలిండర్లను ఎత్తుకెళ్లిన దుండగుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్యాస్ ఏజెన్సీతో వివాదం కారణంగా ఓ వ్యక్తి ఏకంగా అతడి దగ్గర ఉన్న సిలిండర్లనే ఎత్తుకెళ్లాడు. ఏజెన్సీలో ఓ పక్కన పార్క్ చేసిన వాహనంలో ఉన్న సుమారు 60 సిలిండర్లను తీసుకెళ్లాడు.

 • News18
 • Last Updated :

  ఓపక్క సిలిండర్ల ధరలు మండిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు ఒక్క సిలిండర్ కొనాలంటేనే చుక్కలు కనబడుతున్నాయి. కానీ యూపీకి చెందిన ఒక వ్యక్తి.. యజమానితో గొడవపడి ఏకంగా సిలిండర్ల బండినే ఎత్తుకెళ్లాడు. అందులో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 61 గ్యాస్ సిలిండర్లున్నాయి. ఎవరూ లేని సమయం చూసి  ఆ సిలిండర్ల  వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సిలిండర్లను ఎత్తుకెళ్లిన వ్యక్తి.. ఏజెన్సీలో పనిచేసే వ్యక్తే కావడం గమనార్హం.

  ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే గ్యాస్ ఏజెన్సీలో గోవింద్ సింగ్ కు డబ్బు విషయంలో యజమానితో గొడవైంది. తనకు రావల్సిన డబ్బుల గురించి గోవింద్ సింగ్ యజమానిని నిలదీశాడు. కానీ దానికి ఏజెన్సీ ఓనర్ ఒప్పుకోలేదు. ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయింది. దీంతో కోపోద్రిక్తుడైన గోవింద్ సింగ్.. ఏజెన్సీ ముందే పార్క్ చేసి ఉన్న సిలిండర్ల ట్రక్ ను చూశాడు.

  ఎవరూ లేని సమయంలో దానిని తీసుకెళ్లాడు. ఆ ట్రక్ లో 61 సిలిండర్లున్నాయని ఏజెన్సీ ఓనర్ తెలిపాడు.

  uttarapradesh, up news, up crime news, kanpur, cylinders, cylinders stolen, cylinder thief, kanpur news, kanpur crime news, up police, kanpur police
  LPG Cylinder ( ప్రతీకాత్మకచిత్రం)

  గోవింద్ సింగే ఆ సిలిండర్లను ఎత్తుకెళ్లాడని నిర్ధారించుకున్న ఆ యజమాని.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని చాకచక్యంతో పట్టుకున్నారు.అతడి దగ్గరి నుంచి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకుని విచారించగా... అతడు  తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. గ్యాస్ ఏజెన్సీ ఓనర్ తనకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. ఆయన  ఇవ్వడం లేదని, అందుకే సిలిండర్లను ఎత్తుకెళ్లానని చెప్పాడు. ఆ సిలిండర్లన్నీ గ్యాస్ తో నింపి ఉన్నవే కావడం గమనార్హం.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Crime, LPG Cylinder, Theft, Up news

  ఉత్తమ కథలు