సరూర్‌నగర్ చెరువులో నవీన్ మృతదేహం లభ్యం

సరూర్‌నగర్ సమీపంలో వరదనీటిలో కొట్టుకుపోయిన నవీన్ మృతదేహం లభ్యమైంది. సోమవారం డీఆర్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సరూర్‌నగర్‌ చెరువుగండి నుంచి సుమారు 35 అడుగుల దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు.

news18-telugu
Updated: September 22, 2020, 6:54 AM IST
సరూర్‌నగర్ చెరువులో నవీన్ మృతదేహం లభ్యం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సరూర్‌నగర్ సమీపంలో వరదనీటిలో కొట్టుకుపోయిన నవీన్ మృతదేహం లభ్యమైంది. సోమవారం డీఆర్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సరూర్‌నగర్‌ చెరువుగండి నుంచి సుమారు 35 అడుగుల దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. వివరాలు.. అల్మాస్‌గూడ కాలనీకి చెందిన నడిగొప్పు నవీన్‌ కుమార్‌కు భార్య శాలిని, ఇద్దరకు కుమార్తెలు ఉన్నారు. శివ అనే వ్యక్తి వద్ద ఎలక్ట్రీషియన్ వద్ద నవీన్ పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం శివతో కలిసి అతని స్కూటీపైనే నవీన్ అల్మాస్‌గూడకు బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో తపోవన్‌కాలనీ వద్ద రోడ్డుపై వరదను దాటేందకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నవీన్ వరద ప్రవాహంలో కొట్టుకుని పోయాడు.

అయితే నవీన్‌ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అర్ధరాత్రి వేళ భారీ వర్షం కురవడంతో అధికారులు సహాయక చర్యలు నిలిపివేశారు. తిరిగి సోమవారం ఉదయం మరోసారి గాలింపును ప్రారంభించారు. మొత్తం మూడు బ‌ృందాలు నవీన్ ఆచూకీ కోసం సరూర్‌నగర్ చెరువులో గాలింపు చేపట్టాయి. చివరకు నవీన్ విగతా జీవిగా మిగిలాడు. చెరువులోని ఒండ్రులో నవీన్ మృతదేహం లభ్యమైంది. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

నవీన్ మ‌ృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తమకు దిక్కెవరని నవీన్ భార్య శాలిని రోదించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నవీన్ మృతిచెందాని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక, ఇటీవల నేరెడ్‌మెట్‌లో కూడా ఓ చిన్నారి సైకిల్ మీద బయటకు వచ్చిన సమయంలో నాలాల పడి కొట్టుకుపోయి.. మృతిచెందిన సంగతి తెలిసిందే.
Published by: Sumanth Kanukula
First published: September 22, 2020, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading