80 కండోమ్ ప్యాకెట్లను మింగిన యువకుడు... షాకైన అధికారులు...

డ్రగ్స్ నింపిన కండోమ్ ప్యాకెట్లను మింగిన స్మగ్లర్... భారీ జరిమానాతో పాటు పదేళ్ల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 6:12 PM IST
80 కండోమ్ ప్యాకెట్లను మింగిన యువకుడు... షాకైన అధికారులు...
80 కండోమ్ ప్యాకెట్లను మింగిన యువకుడు... షాకైన కస్టమ్స్ అధికారులు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 6:12 PM IST
స్మగ్లింగ్ చేసేందుకు కొత్త కొత్త దారులెన్నో కనుక్కుంటున్నారు స్మగ్లర్లు. తాజాగా కండోమ్ ప్యాకెట్లలో డ్రగ్స్ నింపి, స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడో క్రియేటివ్ స్మగ్లర్. ఆ కండోమ్ ప్యాకెట్లు ఎక్కడ దాచినా దొరికపోతాననే భయంతో... ఎక్కడ దాచాలో తెలియక పొట్టలో దాచాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా... ఈ దృశ్యాలను చూసి డాక్టర్లతో పాటు కస్టమ్స్ అధికారులు కూడా షాక్‌కు గురయ్యారు. దుబాయ్ నుంచి ఈజిప్టుకు వెళ్లే విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడిని స్కాన్ చేసిన కస్టమ్స్ అధికారులు... అతని పొట్టలో ఏదో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అదేంటని అతడిని నిలదీయగా...బాగా బిర్యానీ తిన్నానని చెప్పాడు. అతను చెప్పిన సమాధానానికి, స్కానింగ్‌లో కనిపించే దృశ్యాలకు పొంతన కుదరకపోవడంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు... అతన్ని పరీక్షల కోసం వైద్యలు దగ్గరికి పంపించారు. సదరు వ్యక్తి కడుపుని స్కాన్ చేసిన వైద్యులు... అందులో 80 కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయని గుర్తించారు. వాటిలో కొకైన్ నింపి, అమాంతం మింగేశాడని తేల్చారు. వైద్యులు స్కానింగ్ రిపోర్టులతో సహా నిరూపించడంతో తాను డ్రగ్స్ స్మిగ్లింగ్ చేస్తున్నట్టు అంగీకరించాడు సదరు వ్యక్తి.

దుబాయ్ చట్టాల ప్రకారం డ్రగ్స్ స్మిగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన సదరు వ్యక్తికి లక్ష దినార్‌లు (దాదాపు రూ.2.28 లక్షలు) జరిమానా విధించిన న్యాయస్థానం... పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా జైలుశిక్ష పూర్తయిన తర్వాత అతన్ని దేశం నుంచి బహిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.


First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...