పదిహేనేళ్ల క్రితం వాళ్లిద్దరికీ పెళ్లయింది. అయిదేళ్లు మాత్రమే వారి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో తన ఇద్దరు పిల్లలతో సహా భార్య పుట్టింటికి వచ్చేసింది. పదేళ్ల నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ విడిగానే ఉంటున్నారు. అయితే ఒంటరిగా పుట్టింట్లో ఉంటున్న ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. నాలుగేళ్లుగా అతడు ఆమె ఇంట్లోనే మకాం వేశాడు. కానీ ఉన్నట్టుండి ఊహించని రీతిలో అర్ధరాత్రి అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎండాకాలం కదా అని రాత్రిపూట నిద్రపోయేందుకు బయటే మంచంపై పడుకున్నాడు. అతడిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయిని అతడిపై వేశారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే అతడు మరణించాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం దిగువలభంవారిపల్లెకు ఆదిలక్ష్మి అనే మహిళకు పుంగనూరు మండలం అరడిగుంటకు చెందిన అర్జున్ తో 15 ఏళ్ల క్రితమే పెళ్లయింది. పెళ్లయిన అయిదేళ్లు మాత్రమే వారి కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. అయిదేళ్ల తర్వాత విబేధాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. ఆదిలక్ష్మి తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని శ్రీనివాసపురం తాలూకా ఒలికిరి గ్రామానికి చెందిన మేస్త్రీ శ్రీనివాసులుతో ఆదిలక్ష్మికి పరిచయం ఏర్పడింది. కూలి పనులకు వెళ్లిన సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిని పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి దీసింది. దీంతో నాలుగేళ్లుగా ఆదిలక్ష్మి ఇంట్లోనే అతడు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!
ఎండాకాలం కావడంతో శ్రీనివాసులు రోజూ రాత్రిళ్లు ఇంటి బయటే నిద్రించేవాడు. గురువారం రాత్రి కూడా అదే విధంగా ఇంటి బయట నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెద్ద బండరాయిని అతడిపై వేసి అక్కడినుంచి పరారయ్యాడు. గట్టిగా అతడు కేకలు వేయడంతో ఆదిలక్ష్మి బయటకు వచ్చి చూసింది. తీవ్రరక్తపు మడుగులో ఉన్న అతడిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు మరణించాడు. ఈ ఘాతుకానికి పాల్పడిందెవరన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో అర్జున్ ఈదారుణానికి పాల్పడ్డాడా? లేక మరేదైనా ఇతర గొడవలు కారణమా? అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, Husband kill wife, Telangana crime, Wife kill husband