మనిషిలో అనుమానపు బీజం పడితే అంత ఎంతవరకైనా దారి తీస్తుంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ముంబైలోని ఓ పాత సామాను దుకాణం వ్యాపారి... అనుమానం కారణంగా సొంత భార్యను చంపేశాడు. ఆరుగురు ఆడ పిల్లలకు తండ్రి అయిన మహ్మద్ రఖీబ్ ఖాన్... తన భార్య అజ్మతున్నీసా బేగంపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. తన తోటి వ్యాపారుస్థుడితో ఆమె తరచూ సన్నిహితంగా మాట్లాడటాన్ని తట్టుకోలేకపోయిన రఖీబ్ ఖాన్... ఈ విషయంలో పలుసార్లు భార్యతో గొడవ కూడా పడ్డాడు. అయితే ఎప్పటికప్పుడు తన కూమార్తెలు సర్ది చెప్పడంతో... వివాదం సద్దుమణుగుతూ వచ్చింది. అయితే రఖీబ్లో మాత్రం అనుమానం తొలిగిపోలేదు. తన భార్య తనను మోసం చేస్తోందనే కోపంతో రగలిపోయిన రఖీబ్... గత ఆదివారం అర్థరాత్రి భార్యను ఇంట్లోనే చంపేశాడు.
తన ఆరుగురు అమ్మాయిలు, మరదలు ఇంట్లో ఉన్న సమయంలోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. భార్యతో సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తూనే ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఆమె అరుపులు ఇంట్లో ఎవరికీ వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కేశాడు. అంతా నిద్రలో ఉన్న సమయంలోనే భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా కిరాతకంగా వ్యవహరించాడు రఖీబ్. భార్య చంపిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లిన రఖీబ్... జరిగిన విషయం వారికి వివరించి లొంగిపోయాడు. పోలీసులు అతడికి ఇంటికి వచ్చి తలుపుకొట్టేంతవరకు... అతడి భార్య చనిపోయిందనే విషయం అతడి ఆరుగురు అమ్మాయిలకు కూడా తెలియకపోవడం గమనార్హం. తల్లితో తరచూ గొడవపడే తమ తండ్రి... మరీ ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తాము ఊహించలేకపోయామని అతడి కూతుళ్లు వాపోయారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.