అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ దగ్గర కలకలం... అసలేం జరిగిందంటే...

అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్... హైదరాబాద్‌లో ఫేమస్. ఎప్పుడూ సెలబ్రిటీలు, ప్రముఖులతో కళకళలాడుతూ ఉంటుంది. అలాంటి హోటల్‌ దగ్గర తాజాగా ఏం జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 11:58 AM IST
అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ దగ్గర కలకలం... అసలేం జరిగిందంటే...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 11:58 AM IST
టైమ్ గురువారం అర్థ రాత్రి ఒంటి గంట అయ్యింది. అబిడ్స్‌లోని తాజ్ మహల్ హోటల్‌ చీకటి లైట్లలో మెరుస్తూ వెలుగులు చిమ్ముతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా 'దబ్' మని పెద్ద శబ్దం. అక్కడున్న సెక్యూరిటీ గార్డులు షాకయ్యారు. పై నుంచీ దూకిన ఎవరో హోటల్ ముందు శవంలా పడ్డారు. హోటల్‌లో సిబ్బంది, మేనేజ్‌మెంట్ అంతా హడావుడిగా అక్కడికి వచ్చారు. వెంటనే పోలీసులకు కాల్ వెళ్లింది. కాసేపటికే అక్కడకు వచ్చారు పోలీసులు. పై నుంచీ పడిన వ్యక్తి చనిపోయినట్లు తేల్చారు. అతను ఎవరో అక్కడి సిబ్బందికీ, మేనేజ్‌మెంట్‌కీ తెలుసు. నేపాల్‌కి చెందిన 30 ఏళ్ల మోతీ... నెల కిందటే హోటల్‌లో వెయిటర్‌గా చేరాడు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలా, మూడీగా ఉండేవాడు. అలా ఉండొద్దని తోటి వెయిటర్లు చెప్పేవాళ్లు. అయినా మోతీ మారలేదు.

గురువారం రాత్రి బాగా తాగేశాడు. హోటల్‌లోని రెండో అంతస్థులో నిలబడి... ఏదేదో ఆలోచిస్తూ... మైకంలో మునిగిపోయాడు. కట్ చేస్తే... అక్కడి నుంచీ జారిపడ్డాడో, సూసైడ్ చేసుకున్నాడో గానీ... ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. తోటి వెయిటర్లు మాత్రం మోతీకి... ఆర్థిక సమస్యలు, కుటుంబ కష్టాలూ ఉన్నాయని అంటున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి... దర్యాప్తు చేస్తున్నారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...