పెళ్లి తర్వాత అంతా తలకిందులు.. బలహీన క్షణంలో ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నాడంటే..

నిత్యం మాన‌సిక వేదన‌కు గురైన రాంప్ర‌సాద్ పెద్ద‌వాళ్ల‌వుతున్న క‌న్న‌బిడ్ద‌ల ముందు కూడా తాను బానిస‌గానే బ‌త‌కాల్సి వ‌స్తోంద‌న్న బాధ‌ను గెల‌వ‌లేక‌పోయాడు. ఒకానొక బ‌ల‌హీన‌మైన క్ష‌ణంలో ఓ నిర్ణ‌యం తీసుకున్నాడు.

news18-telugu
Updated: July 2, 2019, 4:24 PM IST
పెళ్లి తర్వాత అంతా తలకిందులు.. బలహీన క్షణంలో ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇష్టం లేని పెళ్లి చేసి.. త‌న కెరీర్‌ను నాశ‌నం చేశారన్న అసంతృప్తితో ఓ వ్యక్తి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్యాబిడ్డలను చంపి చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం నగరంలోని శ్రీరాంనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖ‌మ్మం న‌గ‌రంలోని శ్రీ‌రాంన‌గ‌ర్‌లోని డీఎంకే అపార్ట్‌మెంట్‌లో కోయ రాంప్ర‌సాద్‌(43) భార్య, ఇద్ద‌రు కుమార్తెల‌తో నివసిస్తున్నాడు. అతని స్వ‌స్థ‌లం ముదిగొండ మండ‌లం వ‌ల్ల‌భి. చ‌దువుకునే వ‌య‌సులో తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. పీజీ పూర్తి చేశాక.. ప్ర‌భుత్వ లెక్చ‌ర‌ర్‌గా ఉద్యోగం సంపాదించాల‌ని క‌ల‌లు క‌న్నాడు. అయితే ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ప్ర‌ైవేట్ లెక్చ‌ర‌ర్‌గా చాలాకాలం ప‌నిచేశాడు.

త‌ల్లిదండ్రుల నుంచి పెద్ద‌గా ఆస్తిపాస్తులు లేక‌పోవ‌డంతో ఇష్టం లేక‌పోయినా పెద్ద‌లు చెప్పార‌ని మేన‌మామ కుమార్తె సుచిత్ర‌ను 15 క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి స‌మ‌యంలో మేన‌మామ 10 ఎక‌రాల పంట పొలం, ఖ‌మ్మంలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ఇచ్చారు. పెళ్ల‌య్యాక చాలాకాలం ప్ర‌వేట్ లెక్చ‌ర‌ర్‌గా ఉద్యోగం చేసిన రాంప్ర‌సాద్ జీతం స‌రిపోక‌పోవ‌డంతో త‌న బావ‌మ‌రిదికే చెందిన గ్రానైట్ ఫ్యాక్ట‌రీలో సూప‌ర్‌వైజ‌ర్‌గా చేరాడు. అయితే భార్య బలవంతం మీదనే లెక్చరర్ జాబ్ మానేసి సూపర్ వైజర్ జాబ్ చేస్తున్నట్టు రాంప్రసాద్ సన్నిహితులతో వాపోయేవాడు.

సుచిత్రను పెళ్లి చేసుకున్న తర్వాత.. తనకిష్టమైన లెక్చరర్ జాబ్ వదులుకోవాల్సి రావడం, అత్త మామలే తన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారని అందరూ భావిస్తుండటంతో అతనిలో ఒక రకమైన అసంతృప్తి గూడుకట్టుకుపోయింది. ఉన్న‌త‌ చ‌దువులు చ‌దివిన తాను కేవ‌లం సుచిత్ర‌ను చేసుకోవ‌డం వ‌ల్లే ఇలా సూప‌ర్‌వైజ‌ర్‌గా ప‌నిచేయాల్సి వ‌స్తోందని త‌న స్నేహితుల‌తో చెప్పుకుని బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య‌భ‌ర్త‌లిద్ద‌రికీ అనేక‌సార్లు గొడ‌వ‌ల‌య్యాయి.పెద్ద కుమార్తె రుచిత పుట్టాక నాలుగేళ్ల‌పాటు రాంప్ర‌సాద్ భార్య‌ను కాపురానికి తీసుకురాలేదు. అనంత‌రం పెద్ద‌మ‌నుషులు స‌ర్ది చెప్ప‌డంతో ఒప్పుకున్నాడు. అయినా ఎప్పటిక‌ప్పుడు గొడవ‌లు.. స‌ర్దుబాట్ల సంసారంగానే సాగింది.


చిన్న కుమార్తె జాహ్న‌వి పుట్టాక కూడా ప‌రిస్థితిలో మార్పు రాలేదు. పిల్ల‌లు పెరుగుతున్నారు. కానీ ఆ దంప‌తులిద్ద‌రి మ‌ధ్య ఎడం కూడా అదే రీతిలో పెరుగుతూ వచ్చింది.త‌న పుట్టింటి వారి ద‌యాదాక్షిణ్యాల‌పైనే బ‌తుకుతున్నామ‌న్న ఫీలింగ్ సుచిత్ర‌లో ఉండేద‌ని, దాంతోనే భార్య‌, అత్త‌మామ‌, బావ‌మ‌రిది క‌ల‌సి త‌న వ్య‌క్తిత్వాన్ని చంపేశారంటూ రాంప్ర‌సాద్ ర‌గిలిపోయేవాడ‌ని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఏదైనా శుభ‌కార్యాల‌లో క‌లిసిన బంధువులు 'నీకేంట్రా నీ మామ ఉండ‌గా..' అంటూ స‌ర‌దాగా జోక్ చేసిన సంద‌ర్భంలోనూ రాంప్ర‌సాద్ చెప్పుకోలేనంత‌గా అవ‌మానానికి గుర‌య్యేవాడు. ప్రేమ‌తోనో, అమాయ‌కంగానో 'అమ్మాయి కాపురానికి మేమే అన్నీ ఎదురు పెడుతున్నాం' అంటూ సుచిత్ర త‌ల్లిదండ్రులు బంధువుల‌తో చెప్పే మాట‌లు రాంప్ర‌సాద్ ఇగోను మ‌రింత గాయ‌ప‌ర్చేవి. త‌న‌ను ఓ చేత‌కాని దద్ద‌మ్మ‌లా చిత్రీక‌రిస్తున్నార‌ని లోలోప‌ల ర‌గిలిపోయేవాడు.ఇలా నిత్యం మాన‌సిక వేదన‌కు గురైన రాంప్ర‌సాద్ పెద్ద‌వాళ్ల‌వుతున్న క‌న్న‌బిడ్ద‌ల ముందు కూడా తాను బానిస‌గానే బ‌త‌కాల్సి వ‌స్తోంద‌న్న బాధ‌ను గెల‌వ‌లేక‌పోయాడు. ఒకానొక బ‌ల‌హీన‌మైన క్ష‌ణంలో ఓ నిర్ణ‌యం తీసుకున్నాడు. నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లాడు. రొట్టెలు, కూర‌, ప‌ప్పు తీసుకున్నాడు. దాంతోపాటు 3జీ విష‌పు గుళిక‌లు కూడా తీసుకున్నాడు. ఎలాంటి వాస‌న రాని విధంగా విష‌పు గుళిక‌ల్ని కూర‌ల్లో క‌లిపాడు. ముందుగా భార్య, బిడ్డ‌ల‌కు తినిపించాడు. తిన్నాక మ‌త్తులోనే వాళ్లు నిద్ర‌పోగానే తానుకూడా కాస్త మోతాదు ఎక్కువ వేసుకుని తిన్నాడు. అంతే నిత్యం గాయ‌ప‌డుతున్న రాంప్ర‌సాద్ ఇగో, త‌న‌కు అమ్మానాన్న‌, అన్న ఉన్నార‌న్న సుచిత్ర అమాయ‌క‌త్వంతో కూడిన ధీమా.. క‌ల‌గ‌ల‌సి బంగారు భ‌విష్య‌త్ ఉన్న ఆ చిన్నారుల జీవితాల్లో కూడా చీక‌ట్లు క‌మ్మేలా చేశాయి. అవ‌గాహ‌నారాహిత్యంతో అన్నీ ఉన్నా ఎక్క‌డో తెలీని అసంతృప్తి యావ‌త్తు కుటుంబాన్ని బ‌లితీసుకుంది. ఇరు కుటుంబాల్లో తీర‌ని వ్య‌థ‌ను నింపింది. ఖ‌మ్మం న‌గ‌రంలో జరిగిన ఈ య‌ధార్థ క్రైం క‌థ స‌మాజానికి క‌నువిప్పు కావాల్సి ఉంది.
First published: July 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు