• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN STRANGLES HIS MOTHER LOOTS JEWELLERY WORTH 1 CRORE FOR NOT SUPPORTING HIM MS

అందుకు ఒప్పుకోలేదని.. తల్లిని కిరాతకంగా హత్య చేసిన కన్నకొడుకు...

అందుకు ఒప్పుకోలేదని.. తల్లిని కిరాతకంగా హత్య చేసిన కన్నకొడుకు...

ప్రతీకాత్మక చిత్రం

చేయడానికి పనేంలేకపోవడంతో అతడికి బతకడం కష్టమైంది. ఇంటికెళ్లి తల్లిని డబ్బుల కోసం వేధించేవాడు. కానీ ఆమె.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇది ఆ కొడుకుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

  • News18
  • Last Updated:
  • Share this:
    అతడో నిరుద్యోగి. చేసే పనేంలేక బలాదూర్ గా రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆ యువకుడి అమ్మానాన్న కు నచ్చలేదు. దీంతో వేరే ఇంట్లో కాపురం పెట్టాడు. కానీ చేయడానికి పనేంలేకపోవడంతో బతకడం కష్టమైంది. ఇంటికెళ్లి తల్లిని డబ్బుల కోసం వేధించేవాడు. కానీ ఆమె.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇది ఆ కొడుకుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అంతే ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు.

    ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. యూపీలోని అలీగఢ్ కు చెందిన యోగేశ్.. పనేంలేక బలాదూర్ గా తిరుగుతున్నాడు. ఆరునెలల క్రితం పెద్దలు ఒప్పుకోకున్నా ప్రేమ వివాహం చేసుకున్న యోగేశ్.. ఆమెను పోషించడం కష్టం కావడంతో తరుచూ తల్లిదగ్గరికెళ్లి డబ్బులు అడిగేవాడు. తన భర్తకు తెలియకుండా ఆమె కొన్ని సార్లు డబ్బులివ్వగా.. పలుమార్లు లేవని కరాఖండిగా చెప్పేది. కానీ యోగేశ్ కు జల్సాలు ఎక్కువై డబ్బుల అవసరం ఎక్కువైంది. దీంతో తల్లిని ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని వేధించేవాడు.
    కానీ తన దగ్గర డబ్బులు లేవని.. ఇకపై ఇవ్వడం కుదరదని ఆ తల్లి చెప్పింది. దీంతో విసిగిపోయిన ఆ కొడుకు ఆమెను చంపాలనుకున్నాడు. అందుకు అనుగుణంగానే ముగ్గురు స్నేహితులతో కలిసి పన్నాగం పన్నాడు.

    మూడు రోజుల క్రితం (గత శుక్రవారం) గర్భిణీ అయిన తన భార్యను వారి పుట్టింట్లో దింపాడు. అక్కడ్నుంచి సరాసరి తల్లి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. తలుపు తీసి... కొన్ని తన బట్టలు మిగిలిపోయాయని.. వాటిని తీసుకెళ్తా అని చెప్పుకొచ్చాడు. బెడ్ రూంలో బీరువా నుంచి బట్టలు తీస్తుండగా.. ఒక చీరను తీసి ఆమె గొంతుకు ఉరేశాడు. ఆమె ఎంతగా అరిచినా వినకుండా ఆమె చనిపోయేదాకా చీరను బిగేసి పట్టుకున్నాడు. ఆమె చనిపోయిందని తెలుసుకున్నాక.. తన ఫ్రెండ్స్ తో కలిసి తన డెడ్ బాడీని బాత్ రూంలోకి తీసుకెళ్లాడు. అక్కడే గీజర్ పైప్ కట్ చేసి.. దీనిని ప్రమాదకర ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

    ఆ తర్వాత ఇంటి తలుపులను తెరిచి నిందితులంతా అక్కడ్నుంచి పారిపోయారు. వెళ్లిపోతూ.. ఆమె ఒంటిపై ఉన్న కోటి రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను వెతికే పనిలో ఉన్నారు.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు