Home /News /crime /

MAN STOLEN POLICE JEEP IN BASTI TO GO IN LAWS HOUSE PVN

అరె ఏంట్రా ఇది : అత్తారింటికి వెళ్లేందుకు..పోలీస్ జీపునే దొంగలించాడు!

పోలీసు జీపు

పోలీసు జీపు

Man Stolen police jeep:రోడ్డు మీద పార్క్ చేసి పక్కకి వెళ్లినప్పుడో లేదా ఇంటి ముందు పెట్టి ఉన్నప్పుడో ఇలా కార్లను దొంగలు దొ్ంగిలించి ఎత్తుకెళ్లిన సంఘటనలు గతంలో మనం చాలానే చూశాం. అయితే దొంగతనం చేశాక దొరికితే పోలీస్ స్టేషన్ లో ఊసలు లెక్కపెట్టాల్సిందే. అయితే పోలీస్ జీపునే దొంగలిస్తే?

ఇంకా చదవండి ...
Man Stolen police jeep:రోడ్డు మీద పార్క్ చేసి పక్కకి వెళ్లినప్పుడో లేదా ఇంటి ముందు పెట్టి ఉన్నప్పుడో ఇలా కార్లను దొంగలు దొ్ంగిలించి ఎత్తుకెళ్లిన సంఘటనలు గతంలో మనం చాలానే చూశాం. అయితే దొంగతనం చేశాక దొరికితే పోలీస్ స్టేషన్ లో ఊసలు లెక్కపెట్టాల్సిందే. అయితే పోలీస్ జీపునే దొంగలిస్తే? పోలీసు జీప్ దొంగిలించే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆదివారం ఉత్తరప్రదేశ్(UttarPradesh) లోని బస్తీ జిల్లాలో అలాంటి సంఘటనే జరిగింది. అత్తమామల ఇంట్లో ఉంటున్న భార్యను కలవాలని తహతహలాడుతున్న ఓ యువకుడు పోలీస్ జీపు(Police Jeep)ని దొంగలించి ఎత్తుకెళ్లాడు.

ఉత్తరప్రదేశ్(UttarPradesh) లోని బస్తీ జిల్లాలోని సోనాపూర్​ లో ఆదివారం గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ నిర్వహించబడింది, దీనికి మహిళా సంక్షేమ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి బేబీ రాణి మౌర్య మరియు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి విజయ్ లక్ష్మీ గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో అక్కడ విధులు నిర్వర్తించేందుకు కొత్వాల్​ నగర పోలీసు అధికారి సంజయ్​ కుమార్​ వెళ్లారు. అయితే జనం భారీగా రావడంతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. జీపు పార్కింగ్ చేసే ఖాళీ కూడా లేకుండా పోయింది. దీంతో అక్కడకు కొంత దూరంలో రోడ్డు పక్కన జీపుని పార్క్​ చేసి ఆ దగ్గర్లోనే సేదతీరాడు డ్రైవర్ దీపేంద్ర. అయితే మంత్రుల పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని చాలా టాక్సీలు ప్రోగ్రామ్ కోసం బుక్ చేయబడ్డాయి. ట్యాక్సీల బుకింగ్‌ కారణంగా సామాన్యులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో పుట్టింట్లో ఉన్న తన భార్యను కలవడానికి వెళదామనుకున్న ముండెర్వా పోలీస్​ స్టేషన్​ పరిధి ఛపియా లుతావాన్ ​ గ్రామానికి చెందిన హరేంద్ర(Harendra)అనే 30 ఏళ్ల యువకుడు కూడా సోనాపూర్ లో ట్యాక్సీ దొరక్క ఇబ్బంది పడ్డాడు.

తన పెళ్లి కోసం తానే ప్రకటన ఇచ్చిన యువతి..ఆసక్తి ఉంటే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది

అయితే ఎలాగైనా సరే ఈరోజు వెళ్లి భార్యను కలవాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో పోలీసు జీపు రోడ్డు పక్కన ఖాళీగా ఉండటం, దానికే తాళం ఉండటాన్ని గమనించాడు. పోలీసులు, జనం కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన హరేంద్ర పోలీస్​ జీపును తీసుకుని పరారయ్యాడు. అయితే కొద్దిసేపటి తర్వాత జీవును ఎవరో తీసుకెళ్తున్నారని గమనించిన డ్రైవర్​ దీపేంద్ర అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే మరో వాహనంలో వెంబడించారు. పోలీసులు వెంట పడుతున్నారనే భయంతో జీపుని వేగంగా పోనిచ్చాడు హరేంద్ర. దీంతో కొంతదూరం వెళ్లేసరికి జీపు అదుపుతప్పి పర్సా క్రాస్​రోడ్డు ప్రాంతంలో రహదారి పక్కన ఉన్న చెక్కల కుప్పని ఢీకొట్టి జీపు డ్యామేజీ అయింది. అయితే అక్కడి నుంచి పారిపోయేందుకు హరేంద్ర ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.భర్తలకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లే భార్యలు అర్జెంట్ గా ఈ విషయం తెలుసుకోవాల్సిందే

జీపు ఎందుకు దొంగలించావని పోలీసులు ప్రశ్నించగా.. కొత్వాల్​ ప్రాంతంలోని కరియాపార్​ గ్రామంలో తన అత్తవారింటికి వెళ్తేందుకు తీసుకెళ్లానని చెప్పాడు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, ఇంట్లో వాళ్లతో గొడవపడి వచ్చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా,హరేంద్ర చేసిన ఈ పనికి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Jeep, Police, Uttar pradesh

తదుపరి వార్తలు