Home /News /crime /

MAN STOLE BIKE TO JAIL SENTENCE FOR GOOD FOOD AND FRIENDS IN CHENNAI AK

పక్కా ప్లాన్‌తో జైలుకు... విషయం తెలిసి షాకైన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మూడు నెలల క్రితం ఏ చిన్న నేరం చేసి జైలుకెళ్లిన జ్ఞానప్రకాశం... మొదట్లో అందరిలాగే చాలా బాధపడ్డాడు. అయితే జైలు భోజనానికి బాగా అలవాటు పడ్డ అతగాడికి ఆ తరువాత జైలే బెటర్ అనిపించింది.

    జైలుకెళ్లిన వ్యక్తులు ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా అని ఎదురుచూస్తుంటారు. తమను సాధ్యమైనంత తొందరగా జైలు నుంచి బయటకు తీసుకురావాలని బంధువులు, స్నేహితులను కోరుతుంటారు. జైలులో ఉన్న కాలాన్ని ఓ నరకంగా భావిస్తుంటారు. కానీ చెన్నైకు చెందిన జ్ఞానప్రకాశం అనే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తిగా రివర్స్. ఆయనకు జైలు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే జైలు నుంచి విడుదలైన కొద్దిరోజులకే మళ్లీ నేరానికి పాల్పడి వెళ్లాడు అతగాడు. అయితే అతడు నేరానికి పాల్పడిందే జైలుకు వెళ్లడానికి అనే విషయం తెలసుకుని పోలీసులు అవాక్కయ్యారు. అతడు ఎందుకు అలా చేశాడనే విషయం తెలుసుకుని ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. మూడు పూటలు మంచి భోజనం, స్నేహితుల్లా ఉండే తోటి ఖైదీల కోసమే జ్ఞానప్రకాశం మళ్లీ జైలు బాట పట్టాడు.

    మూడు నెలల క్రితం ఏ చిన్న నేరం చేసి జైలుకెళ్లిన జ్ఞానప్రకాశం... మొదట్లో అందరిలాగే చాలా బాధపడ్డాడు. అయితే జైలు భోజనానికి బాగా అలవాటు పడ్డ అతగాడికి ఆ తరువాత జైలే బెటర్ అనిపించింది. దీనికి తోడు చుట్టూ ఉండే తోటి ఖైదీలు స్నేహంగా ఉండటంతో... అతడికి ఏ మాత్రం బోర్ కొట్టలేదు. దీంతో ఇల్లు కంటే జైలు బాగుందనే అభిప్రాయానికి వచ్చిన జ్ఞానప్రకాశం... బెయిల్‌పై విడుదలైన తరువాత బైక్ చోరీకి పాల్పడ్డాడు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా తనను పట్టుకుంటారని ముందే తెలియడం వల్లే అతడు ఈ నేరానికి పాల్పడినట్టు పోలీసు విచారణలో తేలింది. ఇంట్లో ఖాళీగా ఉండే కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని... జైలులో అలాంటి ఇబ్బంది ఉండదని జ్ఞానప్రకాశం డిసైడయ్యాడు. అందుకే మళ్లీ ఏదో ఒక నేరంగా చేసి జైలుకు రావాలని నిర్ణయించుకుని... ఈ రకంగా మళ్లీ తనకు ఇష్టమైన జైలుకు వచ్చాడు




    First published:

    Tags: Chennai, Jail

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు