MAN STEELS THREE KGS GOLD BY BRAKING SHOP WALL AT MID NIGHT IN THANE MAHARASHTRA HSN
పక్కా స్కెచ్.. రెండు నెలల ముందే వచ్చి.. అర్ధరాత్రి బంగారం షాపు గోడకు బొక్క పెట్టి..
ప్రతీకాత్మక చిత్రం
ఓ వ్యక్తి ఆ బంగారం షాపు గోడకు కన్నం పెట్టి, షాపులోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా మూడు కిలోల బంగారాన్ని దోచేశాడు. తెల్లవారిన తర్వాత యథావిథిగా బంగారం షాపును ఓపెన్ చేసిన సిబ్బందికి, చోరీ జరిగిన సంగతి తెలిసింది. పోలీసులు వచ్చి విచారణ చేస్తే ఓ షాకింగ్ నిజం బయటపడింది. ఆ బంగారం షాపునకు బొక్క పెట్టింది పక్క షాపులోనుంచే అని తేటతెల్లమయింది.
కొందరు దొంగలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పక్కా ప్లాన్ తో దొంగతనం చేయాల్సిన చోటుకు వస్తారు. తమకు అనుకూలమైన టైమ్ వచ్చేదాకా ఓపికగా ఎదురుచూస్తారు. అన్నీ ఓకే అనుకున్నాకే తమ పనని చల్లగా పూర్తి చేస్తారు. దాని కోసం రోజులు, నెలలే కాదు ఏళ్ల తరబడి కూడా ఎదురుచూస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్ర రాజధాని ముంబై పక్కన ఉన్న థానే నగరంలో జరిగింది. ఓ బంగారం షాపును కొల్లగొట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలోల పసిడిని ఆ ఘరానా దొంగ కొట్టేశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలిసి పోలీసులే అవాక్కయ్యారు.
థానేలోని శివాయ్ నగర్ లో వరిమాతా గోల్డ్ అనే బంగారం షాపు ఉంది. దీనిలో శనివారం అర్ధరాత్రి దాటాక అంటే ఆదివారం ఉదయం 2 నుంచి 2.30గంటల సమయంలో దొంగతనం జరిగింది. ఓ వ్యక్తి ఆ బంగారం షాపు గోడకు కన్నం పెట్టి, షాపులోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా మూడు కిలోల బంగారాన్ని దోచేశాడు. తెల్లవారిన తర్వాత యథావిథిగా బంగారం షాపును ఓపెన్ చేసిన సిబ్బందికి, చోరీ జరిగిన సంగతి తెలిసింది. పోలీసులు వచ్చి విచారణ చేస్తే ఓ షాకింగ్ నిజం బయటపడింది. ఆ బంగారం షాపునకు బొక్క పెట్టింది పక్క షాపులోనుంచే అని తేటతెల్లమయింది.
రెండు నెలల క్రితం బంగారం షాపు పక్కనే ఉన్న ఓ షాపు ఖాళీ అయింది. దీనికి ఏకంగా నెలకు 28వేల అద్దె ఇస్తానంటూ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ముందుకొచ్చాడు. అద్దె వస్తుంది కదా అని యజమాని కూడా సరేనని అతడికి ఆ షాపును ఇచ్చాడు. రెండు నెలలుగా ఆ షాపులో పండ్లను అమ్ముతూ ఉన్నాడు. ఈ శనివారం అర్ధరాత్రి దాటాక అతడే, ఆ షాపు గోడలోంచి బంగారం షాపులోకి కన్నం పెట్టాడు. ఎంచక్కా లోపలికి వెళ్లి మూడు కిలోల బంగారాన్ని దోచుకెళ్లాడు. దీంతో ఆ పండ్ల షాపు వ్యక్తి కోసం వర్తక్ నగర్ పోలీసులు వెతుకుతున్నారు. ఆ షాపు యజమాని వద్ద పండ్ల షాపు వ్యక్తికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో వేరే దిశగా విచారణ మొదలు పెట్టారు.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.