MAN STEALS RARE BABY CAMEL AS GIFT FOR GIRLFRIEND BIRTHDAY THEN ARRESTED MS
Camel: ప్రియురాలి పుట్టినరోజున ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ప్రేమికుడు.. జైళ్లో పెట్టిన పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమలో ఉన్నప్పుడు తాము ఏం చేస్తున్నామో వారికి తెలియదు. అంత ఆలోచించేంత టైం కూడా ఉండదు. ఆమెను/అతడిని ఇంప్రెస్ చేశామా..? లేదా..? అన్నదే అసలు విషయం. అయితే ఆ ఇంప్రెస్ చేసే సమయంలో చేసే తప్పులే ముప్పును తీసుకొస్తాయి.
అతడు ఒక అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నాడు. ఇటీవలే ఆమె పుట్టినరోజు జరుపుకుంది. ప్రియురాలి పుట్టినరోజు అయితే ప్రియుడి గిఫ్ట్ ఉండాలిగా. ప్రేమలో ఉంటే ఖచ్చితంగా ఉండాలి. ఆ సమయంలో అది తప్పక చేయవలసిన పనుల్లో ఒకటి. మరి ఆ అమ్మాయి తనను వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అని అనుకోవడం ఎలా..? ఆ అబ్బాయి బాగా ఆలోచించాడు. తన గర్ల్ ఫ్రెండ్ జీవితంలో మరిచిపోని భారీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆ అమ్మాయికి బహుమతి ఇచ్చాడు కూడా. కానీ అతడి దురదృష్టం. వారం తిరగకముందే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అసలు పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు..?
ప్రేమలో ఉన్నప్పుడు తాము ఏం చేస్తున్నామో వారికి తెలియదు. అంత ఆలోచించేంత టైం కూడా ఉండదు. ఆమెను/అతడిని ఇంప్రెస్ చేశామా..? లేదా..? అన్నదే అసలు విషయం. అయితే ఆ ఇంప్రెస్ చేసే సమయంలో చేసే తప్పులే ముప్పును తీసుకొస్తాయి. తాజాగా దుబాయ్ కు చెందిన ఒక ప్రేమికుడు.. ప్రియురాలి పుట్టినరోజు కోసం చేసిన పని అతడిని కటకటాల్లోకి నెట్టింది. ఆమె బర్త్ డే కోసం అతడు ఏకంగా ఒంటెను దొంగిలించాడు. దానిని ఆమెను బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు.
గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా సదరు వ్యక్తి.. అరుదైన జాతికి చెందిన ఒంటెను దొంగిలించి గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే తల్లి ఒంటెను దొంగిలించడానికి వెళ్లగా.. ఆ సమయంలో పొరుగు వాళ్లు రావడంతో ఆ పనిని మానుకున్నాడు. మళ్లీ అదే ఇంటికి వెళ్లి తల్లి ఒంటె పిల్లను దొంగిలించాడు. అయితే నాలుగు రోజుల పాటు చుట్టుపక్కల వెతికిన దాని యజమానులు.. అది కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఒంటెను ఎత్తుకుపోవడానికి యత్నించాడనే ఆరోపణతో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.
ఆ పై అతడిని విచారించగా అసలు విషయం చెప్పాడు. దొంగిలించిన ఒంటెను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఉంచానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఆ ఒంటెను స్వాధీనం చేసుకుని.. దానిని అసలు యజమానులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.