Man steals KSRTC bus : మెకానిక్ వేషంలో వచ్చిన దొంగ ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. అది కూడా ఆర్టీసీ బస్లాండ్ నుంచే బస్సుని దొంగలించాడు. కేరళ(kerala)లోని అలువా డిపోలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో మెకానిక్ దుస్తులు ధరించి డిపోకు వచ్చిన నిందితుడు కేఎస్ఆర్టీసీ బస్సుని దొంగలించాడు. అలువ నుంచి కోజికోడ్ వెళ్లాల్సిన బస్సును చోరీ చేసుకొని వెళ్లాడు. బస్సును చెకింగ్ కోసం మెకానిక్ తీసుకెళ్తున్నాడని అక్కడి ఉద్యోగులు భావించారు. అయితే అతివేగంగా వస్తున్న బస్సును చూసి అనుమానం వచ్చిన సెక్యూరిటీ అధికారి డిపోకు సమాచారం అందించారు. డిపో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం కోసం బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే బస్సుని దొంగలించి ఎర్నాకులంకి తీసుకెళ్తున్న సమయంలో దారిలో కలూర్ సమీపంలో ఓ వాహనాన్ని ఢీకొట్టాడు నిందితుడు. ప్రమాదం గురించి సమాచారం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఆరా తీయగా బస్సు చోరీ విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా,అతడు బస్సుని దొంగతనం చేస్తున్న సమయంలో సీసీటీవీలో నమోదైన దృశ్యాలు వైరల్ గా మారాయి.
ALSO READ OMG: ఇన్ స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో ఇదే..
మరోవైపు, మధ్యప్రదేశ్(Madhyapradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కేందుకు వేచి చూస్తున్న ఓ కుటుంబంపైకి అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నాం గ్వాలియర్ కి 22 కి.మీ దూరంలోని బరాగావ్ ఖురాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ జిల్లాలోని బరాగావ్ ఖురాయ్ గ్రామంలో జరిగిన వివాహ కార్యక్రమానికి గురువారం ఓ కుటుంబం హాజరైంది. కార్యక్రమం పూర్తయ్యాక బస్సు కోసం రోడ్డుపై వేచి ఉన్నారు. అదే సమయంలో అత్యంత వేగంగా నడుపుతూ రోడ్డుపై వేచి ఉన్న వారిపైకి కారుతో దూసుకెళ్లాడు ఓ డ్రైవర్. ఈ ఘటనలో భార్యా-భర్తతో పాటు వారి ఇద్దరి మైనర్ కూతుళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులను పప్పు జఠవ్ (50), అతడి భార్య రాజా బేటీ (35), వారి కుమార్తెలు రేష్మ (10), పూనమ్‌గా (5) గుర్తించారు. ఇక,ఘటన తర్వాత డ్రైవర్ కారు వదిలి పారిపోయాడు. పరారయ్యాడు. గుర్తు తెలియని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.