MAN STABS WOMAN TO DEATH ON GOA BEACH FOR ENDING RELATIONSHIP ARRESTED PAH
Love Affair: ప్రియురాలు అవాయిడ్ చేస్తోందని గోవా తీసుకెళ్లాడు... అక్కడ ఏంజరిగిందంటే...
ప్రతీకాత్మక చిత్రం
Goa trip: యువతిని కాలేజీ రోజుల నుంచి లవ్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఏంజరిగిందో కానీ ఉన్నట్టుండి యువతి ప్రవర్తనలో మార్పు వచ్చింది.
ఇద్దరు కాలేజీ రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లేవారు. కలసి ఎంజాయ్ చేసేవారు. ఎక్కువ సమయం ఇద్దరు కలిసి ఉండేవారు. ఈ క్రమంలో ఏమైందో కానీ.. ఆమె అతగాడిని దూరం పెట్టింది. ఈ ఘటన గోవాలో (Goa) జరిగింది. కలం గుట్కర్ (26) అనే యువకుడు, యువతిని ప్రేమించాడు. కాలేజ్ డేస్ నుంచి ఇద్దరు కలిసి ఉండేవారు. ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లేవారు. కొన్ని రోజుల నుంచి ఇతను ఫోన్ ను యువతి లిఫ్ట్ చేయట్లేదు. అవాయిడ్ చేస్తుంది.
నీతో సంబంధం కొనసాగించడం (Affair) ఇష్టం లేదని తేగేసి చెప్పింది. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత.. ఆమెను ఎక్కడికైన తీసుకెళ్తే మారుతుందను కున్నాడు. ఒక ప్లాన్ వేశాడు. గోవా తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి వెల్సన్ బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో కత్తితో ఆమెపై దాడిచేశారు. అక్కడే చంపేసి.. పొదల్లో వదిలేశాడు. స్థానికులు పొదల్లో శవం ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అనుమానస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.
ఢిల్లీలో ఒక కుటుంబం తమ ఇంట్లో పని మనిషి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్లో అభిజిత్,అతని భార్యతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో వారు.. రజని అనే పనిమనిషిని పెట్టుకున్నారు. ఆమె వెస్ట్ బెంగాల్ లోని సిల్ గురికి చెందిన మహిళ. ఆమె పొట్ట కూటికోసం వీరి ఇంటిలో పనిలో చేరింది. ఆమెకు నెలకు 7000 రూపాయలను వీరు చెల్లిస్తున్నారు.
కొంత కాలంగా అభిజిత్ దంపతులు రజనిని వేధిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం.. రజనిపై పట్ల అత్యంత దారుణంగా (Thrashed By Delhi Couple) ప్రవర్తించారు. ఆమెను తల, కళ్ళు, ముఖం, ఇతర అవయవాలు, పొత్తికడుపుతో పాటు ఇతర శరీర భాగాలపై కొడుతూ తీవ్రంగా గాయాపర్చారు. ఆ తర్వాత.. ఆమెను గదిలో నిర్భందించారు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి పొవడంతో ఆమెను, ఇంటిదగ్గర వదిలేసి వెళ్లిపోయారు. రోడ్డుపై పడి ఉన్న రజనిని అక్కడి వారు గుర్తించారు. ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలో ఉంది. శరీరం అంతా గాయాలుఉన్నాయి.
దీంతో ఆమెను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన ఆదివారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆమె జుట్టు కత్తిరించి ఉంది. ఆమె ముఖంపై పిడిగుద్దుల కురిపించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటన తర్వాత నిందితులు పరారయ్యారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. అయిత, గతంలో కూడా ఈ దంపతులు ఇలాగే మరో పనిమనిషి మీత భౌతికంగా దాడిచేశారని పోలీసుల విచారణలో తెలింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.