హోమ్ /వార్తలు /క్రైమ్ /

మద్యం కొనుగోలు చేస్తుండగా వివాదం.. వైన్ షాప్ ఓనర్‌ను పొడిచిన కస్టమర్

మద్యం కొనుగోలు చేస్తుండగా వివాదం.. వైన్ షాప్ ఓనర్‌ను పొడిచిన కస్టమర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మద్యం షాప్ వద్ద ఆవేశంతో ఓ వ్యక్తి ఆ షాప్ యజమానిపైనే కత్తితో దాడి చేశాడు. మద్యం కొనుగోలుకు సంబంధించి రూ. 500 విషయంలో చెలరేగిన వివాదం ఈ దారుణానికి కారణమైంది.

  మద్యం షాప్ వద్ద ఆవేశంతో ఓ వ్యక్తి ఆ షాప్ యజమానిపైనే కత్తెరతో దాడి చేశాడు. మద్యం కొనుగోలుకు సంబంధించి రూ. 500 విషయంలో చెలరేగిన వివాదం ఈ దారుణానికి కారణమైంది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలోని మహారల్ గ్రామం రోస్ వైన్ షాప్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడిని ఉల్హాస్‌నగర్‌కు చెందిన గోవింద్ ప్రేమ్ ప్రకాశ్ వర్మగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వైన్ షాప్ వద్ద రాత్రి వేళ ఎక్కువగా రద్దీగా ఉన్న సమయంలో ప్రేమ్ ప్రకాశ్ వర్మ అక్కడికి మద్యం కొనుగోలు చేసేకందుకు వచ్చాడు.

  మద్యం కొనుగోలు చేసేందుకు తాను వైన్ షాప్ ఓనర్ ధరమ్‌పాల్‌కు రూ. 500 చెల్లించినట్టు ప్రేమ్ ప్రకాష్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే షాప్ ఓనర్ మాత్రం తనకు డబ్బులు ఇవ్వలేదని అన్నాడు. అయితే వర్మ మాత్రం తాను ఇచ్చానని చెప్పడంతో.. షాప్ ఓనర్ కొద్ది సేపు ఆగాల్సిందిగా అతన్నికోరాడు. సీసీటీవీ చెక్ చేస్తే అసలు విషయం తెలుస్తుందన్నాడు. అయితే ఈలోపే అక్కడి నుంచి వెళ్లిపోయిన వర్మ.. పావుగంట తర్వాత తిరిగి వైన్ షాప్ వద్దకు చేరుకున్నాడు. షాప్ లోనికి ప్రవేశించే అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగాడు.

  ఈ వాగ్వాదం జరుగుతుండగానే నిందితుడు.. వైన్ షాప్ ఓనర్‌పై తనతో తీసుకొచ్చిన సుత్తి, కత్తెరతో దాడికి దిగాడు. కత్తెరతో అతన్ని పొడిచాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు వర్మపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వర్మను అరెస్ట్ చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Maharashtra, Wine shops

  ఉత్తమ కథలు