హోమ్ /వార్తలు /క్రైమ్ /

తాను తీసుకొచ్చిన పెరుగు తిన్నదని భార్యపై హత్యాయత్నం చేసిన భర్త.. తగిన శాస్తి చేసిన కోర్టు

తాను తీసుకొచ్చిన పెరుగు తిన్నదని భార్యపై హత్యాయత్నం చేసిన భర్త.. తగిన శాస్తి చేసిన కోర్టు

ఈ నేపథ్యంలోనే తండ్రి సంపాదించిన ఆస్థి పంపకాల్లో వీరికి తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో రైసా బేగం 

ప్రొఫెషనల్‌గా అడ్వకేట్ కావడంతో చట్టపరంగా ఏమీ చేయలేకపోయారు..
(ప్రతీకాత్మక చిత్రం)

ఈ నేపథ్యంలోనే తండ్రి సంపాదించిన ఆస్థి పంపకాల్లో వీరికి తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో రైసా బేగం ప్రొఫెషనల్‌గా అడ్వకేట్ కావడంతో చట్టపరంగా ఏమీ చేయలేకపోయారు.. (ప్రతీకాత్మక చిత్రం)

ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివాన అయింది. ఈ క్రమంలో నిందితుడు సచిన్.. తన భార్యపై హత్యాయత్నం చేశాడు. తాను తీసుకొచ్చిన పెరుగు తింటావా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను హత్య చేయబోయాడు.

  • News18
  • Last Updated :

తాను తీసుకొచ్చిన పెరుగును.. తనకు తెలియకుండా భార్య తిన్నదని ఆరోపిస్తూ ఒక భర్త భార్యపై హత్యాయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబయిలోని అంటోప్ హిల్ కు చెందిన సచిన్.. కొద్ది రోజుల క్రితం తన భార్యతో గొడవ పడ్డాడు. నిరుద్యోగి అయిన సచిన్.. నిత్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. ఒకరోజు రాత్రి ఫుల్లుగా తాగివచ్చి.. ఇంటికి వస్తూ పెరుగు తీసుకొచ్చాడు. అయితే తాను బయటకు వెళ్లి.. కాళ్లు కడుక్కుని వచ్చేసరికి ఆ పెరుగులో కొంత భాగం ఖాళీ అయింది. దీంతో సచిన్.. తన భర్తే ఆ పెరుగు తిన్నదని ఆరోపించాడు. తాను తిన్లేదని చెబుతున్నా వినకుండా.. ‘దొంగ పిల్లిలా వచ్చావ్.. నా పెరుగు మొత్తం నూవే తిన్నావ్...’ అని ఆమెతో గొడవకు దిగాడు.

ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివాన అయింది. ఈ క్రమంలో నిందితుడు సచిన్.. తన భార్యపై హత్యాయత్నం చేశాడు. తాను తీసుకొచ్చిన పెరుగు తింటావా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను హత్య చేయబోయాడు. తాను ఆ పెరుగును తినలేదని.. తన అమ్మగారి ఇంటి నుంచి తీసుకొచ్చిన పెరుగును తిన్నానని ఆమె చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఎంత చెప్పినా సచిన్ వినిపించుకోలేదు. కానీ కుటుంబసభ్యుల సహకారంతో ఆమె ఆ దారుణం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆమె భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది.

ఈ కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. భార్యను హత్య చేయబోయినందుకు గానూ నిందితుడికి ఎనిమిదేండ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడు చేసింది మాములు నేరం కాదని.. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి.. ఆమెపై కత్తి దూయబోయాడని ఆరోపించింది.

First published:

Tags: Crime, Crime news, Maharashtra, Mumbai, Mumbai crime, Murder attempt

ఉత్తమ కథలు