• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN STABS BROTHER TO DEATH FOR FAT SHAMING HIM IN DELHI SK

తమ్ముడిని కత్తెరతో పొడిచి చంపిన అన్న...లావుగా ఉన్నావని..

తమ్ముడిని కత్తెరతో పొడిచి చంపిన అన్న...లావుగా ఉన్నావని..

ప్రతీకాత్మక చిత్రం

తీవ్ర కోపోద్రిక్తుడైన నిజాం తమ్ముడిపై కత్తెరతో దాడిచేశాడు. గుండెల్లో పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు ఆరిఫ్. ఐతే ఈ హత్య విషయం బయటకు పొక్కకుండా..ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు.

  • Share this:
    ప్రస్తుత సమాజంలో జనాల్లో నేరప్రవృత్తి విపరీతంగా పెరిగిపోయింది. క్షణికావేశంలో ఘోరాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే కొట్టుకు చస్తున్నారు. మాటలతో సమసిపోయే వివాదాలను చంపుకునే దాకా తీసుకెళ్తున్నారు. రక్త సంబంధాన్ని కూడా మరచిపోయి రక్తాన్ని కళ్లజూస్తున్నారు. ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. సొంత తమ్ముడిని కత్తెరతో పొడిచిచంపాడు ఓ వ్యక్తి. లావుగా ఉన్నావని సరదాగా ఆటపట్టింనందుకు ఏకంగా ప్రాణాలను తీసేశాడు. నందనగరి ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    నిజాం (28), ఆరిఫ్ (25) అన్నాదమ్ముళ్లు. తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోని నందనగరిలో నివాసం ఉంటున్నారు. నిజాం కాస్త బొద్దుగా ఉండేవాడు. లావుగా ఉండే నిజాంను..అతని సోదరుడు ఆరిఫ్ సరదాగా ఆటపట్టించేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా ఎప్పటిలాగానే వెక్కిరించాడు. దాంతో తీవ్ర కోపోద్రిక్తుడైన నిజాం తమ్ముడిపై కత్తెరతో దాడిచేశాడు. గుండెల్లో పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు ఆరిఫ్. ఐతే ఈ హత్య విషయం బయటకు పొక్కకుండా..ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు.

    ఆరిఫ్ నిద్రిస్తున్న సమయంలో షెల్ఫ్ మీద నుంచి కత్తెర పడి..గుండెలో గుచ్చుకుందని పోలీసులకు తెలిపారు. కానీ పోలీసులు నమ్మలేదు. ఇంట్లో చిన్నపిల్లాడిని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఆ బాలుడు నిజాం కుమారుడు. తన తండ్రి బాబాయ్‌తో గొడవపడడం చూశానని.. ఆ సమయంలో వారితో పాటు తానొక్కడినే ఇంట్లో ఉన్నానని చెప్పాడు. ఇక డాక్టర్లు సైతం అది ప్రమాదం కాదని..ఎవరో బలంగా పొడిచారని ధృవీకరించారు. దాంతో నిజామే తమ్ముడిని హత్యచేశాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిజాంతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    First published: