ఎవరైనా గొడవ పడితే సర్ధి చెప్పడానికే పోలీసులు ఉన్నది. అలాంటిది పోలీసుపైనే దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఆ సీన్ తెలుగు సినిమాలో క్లైమాక్స్‌ని తలపించే విధంగా ఉంటుంది. కేరళ(Kerala)లో కూడా సరిగ్గా అలాంటి సీనే చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో (Video)రీసెంట్గా బయటకు రావడంతో వైరల్ అవుతోంది. ఓ సాధారణ వ్యక్తి ఏంటీ ఎస్ఐ(Subinspector)పై దాడి చేయడం ఏమిటని ఆశ్చర్యపోకండి. సీన్ చూస్తే ఎవ్వరికి అర్ధం కాదు స్టోరీ తెలిస్తేనే ఎందుకు అటాక్ చేశాడో తెలుస్తుంది. ఈ సంఘటన అలప్పుజ(Alappuzha)లోని నూరనాడు(Nooranadu)గ్రామంలో నడిరోడ్డుపై జరిగింది. నూరనాడు పోలీస్ స్టేషన్(Police station)లో సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ పోలీస్ వాహనంలో పెట్రోలింగ్(Patrolling)కి వెళ్తుండగా అతనిపై అటాక్ జరిగింది.
పోలీసుపైనే హత్యాయత్నం..
కేరళలో యూనిఫామ్ వేసుకొని డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ అధికారిని గొడ్డలితో నరికేందుకు ఒక వ్యక్తి సాహసం చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. యాక్టివాపై వచ్చిన సుగ్ధన్ అనే వ్యక్తి వెంట ఓ పెద్ద తల్వార్ వంటి కత్తి తెచ్చుకున్నాడు. ఎస్ఐ కోసం సెంటర్లో రోడ్డు పక్కనే తన వాహనాన్ని ఆపి ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీస్ జీపులో కూర్చున్న ఎస్ఐని కవ్వించినట్లుగా చూడటంతో అతను వెంటనే జీపు దిగాడు. ఎస్ఐ జీపు దిగడం గమనించి వెంటనే సుగ్ధన్ తన వెంట తెచ్చుకున్న గొడ్డలి లాంటి కత్తితో ఎస్పైకి ఎత్తాడు. ఎస్ఐ అప్రమత్తంగా ఉన్నప్పటికి సుగ్ధన్ చేతిలో కత్తిని పట్టుకోవడంతో గాయమైంది. ఇదంతా నడిరోడ్డుపై జరుగుతుంటే దాడి చేయబోయిన వ్యక్తి ఎవరూ ఆపలేదు. ఎస్ఐ అదే పట్టుతో సుగ్దాన్ చేతిని ఒడిసిపట్టుకొని కిందపడేశాడు. ఇద్దరూ పెనుగులాడారు. చివరకు నిందితుడు సుగ్దాన్ చేతిలోంచి కత్తిని తీసుకొని పోలీస్ జీప్ ఎక్కించాడు. ఈనెల13వ తేదిన జరిగిన ఈ సంఘటన అంతా రోడ్డు పక్కన అమర్చిన సీసీ కెమెరాలో రికార్డైంది.
ఖాకీపైనే కత్తి దూశాడు..
నిందితుడ్ని పోలీస్ జీప్ ఎక్కిస్తుండగా స్థానికులు కొందరు వచ్చి అతడ్ని వదిలిపెట్టమని అడిగారు. అయితే ఎస్ఐ చేతికి గాయం కావడంతో సుగ్దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పడంతో గమ్మునుండిపోయారు. అయితే ఎస్ఐని సుగ్దాన్ ఎందుకు కొట్టబోయాడని స్థానికులు ఆరా తీస్తే నిందితుడు సుగ్ధాన్ అతని సోదరుడికి ఆస్తి విషయంలో విభేదాలు ఉన్నాయి. అన్నదమ్ముల పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ ఎస్ఐ వీరిద్దరి ఫిర్యాదు మేరకు ఎస్ఐ నిందితుడి సోదరుడికి అనుకూలంగా వ్యవహరించాడనే కోపంతో ఈ దాడి ప్రయత్నించినట్లుగా గుర్తించారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొనే ఎస్ఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాడిలో ఎస్ఐకి గాయమవడంతో నిందితుడు సుగ్దాన్పై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kerala, Viral Video