భార్యాభర్తల గొడవ మధ్యలో దూరాడు... అతని ప్రాణాలు పోయాయ్...

Delhi : ఈ కేసుకి సంబంధించి జితిన్ బోరాను అరెస్టు చేశారు పోలీసులు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 8:50 AM IST
భార్యాభర్తల గొడవ మధ్యలో దూరాడు... అతని ప్రాణాలు పోయాయ్...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 14, 2019, 8:50 AM IST
అది ఢిల్లీలోని సమృద్ధపూర్ ప్రాంతం. తన కజిన్‌తోపాటూ నివసిస్తున్నాడు సెక్యూరిటీ గార్డైన సంజీవ్ పాండే. పగలు ఓ టీ షాపులో పనిచేస్తూ... రాత్రిళ్లు పార్ట్ టైమ్ జాబులా సెక్యూరిటీ గార్డుగా ఉంటున్నాడు. అతను పనిచేసే అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో జితిన్ బోరా ఆయన భార్య దేవీ, వారి పాప ఉంటున్నారు. ఆ రోజు అర్థరాత్రి వేళ నువ్వే అంతా చేశావ్... నేనేం చేశానే... తప్పంతా నీదే... ఇలా దెబ్బలాడుకుంటున్నారు భార్యాభర్తలు. ఎంతకీ కేకలు ఆపకపోవడంతో... వాళ్లకు సర్దిచెబుదామని ఆ ఫ్లాట్‌లోకి వెళ్లాడు 20 ఏళ్ల సంజీవ్ పాండే. ఆ సమయంలో... బెడ్ రూంలో దెబ్బలాడుకుంటున్నారు భార్యాభర్తలు. మధ్యలో దూరిన సంజీవ్... ఎందుకు గొడవపడుతున్నారు అంటూ ఇద్దర్నీ వారించాడు. కాసేపటికి అంతా కూల్ అయ్యింది. హమ్మయ్య అనుకున్న సంజీవ్... తిరిగి కిందకు వెళ్లి... గేటు దగ్గర కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు.

కాసేపటి తర్వాత కత్తితో కిందకు వచ్చిన జితిన్ బోరా... ఆ కత్తిని తిన్నగా సంజీవ్ పాండే గుండెలో గుచ్చాడు. అప్పటికే కాస్త నిద్ర మత్తులోకి జారుకున్న సంజీవ్... ఒక్కసారిగా కళ్లు తెరిచి షాకయ్యాడు. రక్తం బొటబొటా కారుతుంటే... ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతనికి.... అంతలోనే ఆ కత్తిని గుండె లోంచి వెనక్కి లాగిన జితిన్ బోరా... దాన్ని సంజీవ్ తొడపై గుచ్చి తన ఫ్లాట్‌లోకి వెళ్లిపోయాడు.

చుట్టుపక్కల వాళ్లు సంజీవ్‌ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతను చనిపోయాడు. ఫ్లాట్‌లోంచీ పారిపోయిన జితిన్ బోరా... తన ఫ్రెండ్ ఇంట్లో దాక్కున్నాడు. అతని మొబైల్ నంబర్ ట్రాక్ చేసిన పోలీసులు... అతన్ని అరెస్టు చేశారు.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...