నడిరోడ్డుపై తాగుబోతుల వీరంగం.. చెల్లెల్ని కాపాడుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన అన్న

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన తాగుబోతులు.. కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె అన్నను అత్యంత దారుణంగా హత్య చేశారు.

 • Share this:
  ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయి. ఒకదాని మరోకటి వరుసగా చోటుచేసుకున్న నేర ఘటనలు కలకలం రేపుతాయి. తాజాగా నోయిడాలో ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన తాగుబోతులు.. కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె అన్నను అత్యంత దారుణంగా హత్య చేశారు. వివరాలు.. 22 ఏళ్ల యువకుడు, అతని చెల్లెలితో కలిసి సెక్టార్‌ 8లోని ఓ స్పోర్ట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. శుక్రవారం పని పూర్తయిన వారిద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 8.40 గంటల సమయంలో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఇద్దరు తాగుబోతులు వారిని అడ్డగించారు. అందులో ఓ వ్యక్తి ఆ యువతిపై పడ్డాడు. ఇది యువతికి, తాగుబోతుకు మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే తనతో అనుచితంగా ప్రవర్తించిన తాగుబోతును యువతి చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఇద్దరు తాగుబోతులు వారి వద్ద ఉన్న కత్తిని తీసి యువతిని పొడిచి చంపడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నానికి అడ్డుకున్న యువతి సోదరుడు ఆమెను రక్షించాడు. ఆ తర్వాత ఇద్దరు తాగుబోతులు కత్తితో యువతి అన్నను పలుమార్లు పొడిచారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు.

  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకునేలోపే నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడిని పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి అతన్ని షిఫ్ట్ చేశారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి అతడు కన్నుమూశాడు.

  ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు తాగుబోతుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని పారిశుద్ద్య కార్మికుడు సర్వేష్ కుమార్‌గా (24) గుర్తించారు. మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
  Published by:Sumanth Kanukula
  First published: