news18-telugu
Updated: November 26, 2020, 10:16 AM IST
ప్రతీకాత్మక చిత్రం
మద్యం మత్తులో ఓ వ్యక్తి గొంతు కట్టుకున్న భార్య గొంతు కోశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కడప జిల్లా పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయితీ దేవసముద్రం వడ్డిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే శ్రీను, మంగమ్మ దంపతులు పలు సందర్భాల్లో గొడవలు పడేవారు. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన శ్రీను తన భార్యతో గొడవపడ్డారు. కొద్దిసేపటికి వీరి మధ్య ఘర్షణ పెరిగింది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న శ్రీను.. మంగమ్మ గొంతుకోసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మంగమ్మ గొంతుకోసిన తర్వాత శ్రీను ఆత్మహత్య యత్నం చేశాడు.
అయితే భారీ వర్షం పడుతుండటంతో చుట్టుపక్కల వాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్దిసేపటికి మంగమ్మను గొంతు తెగి రక్తం కారుతున్న స్థితిలో గుర్తించిన స్థానికులు 108కి సమాచారం అందజేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. శ్రీను, మంగమ్మ దంపతులను ఆసత్ప్రికి తరలించారు. తొలుత వీరికి రాజంపేట ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వీరిని కడప సర్వజన ఆస్పత్రికి తరలించారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 26, 2020, 10:16 AM IST