విమానం నుంచి ప్రయాణికుడిని గెంటేశారు... ఎందుకో తెలుసా ?

క్రిస్మస్ నాడు అహ్మదాబాద్ నుంచి గోవా బయలుదేరిన విమానంలోని ఓ ప్రయాణికుడు... ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటి తరువాత టాయిలెట్‌లోకి వెళ్లి దమ్ముకొట్టడం మొదలుపెట్టాడు.

news18-telugu
Updated: December 27, 2018, 10:31 AM IST
విమానం నుంచి ప్రయాణికుడిని గెంటేశారు... ఎందుకో తెలుసా ?
ఇండిగో విమానం
  • Share this:
కొంతమంది పొగరాయుళ్లకు దమ్ము కొట్టడం అస్సలు ఉండలేరు. తాము ఎక్కడున్నామనే విషయాన్ని పట్టించుకోకుండా సిగరెట్ తాగడం వీరికి అలవాటు. నో స్మోకింగ్ బోర్డులు, అలాంటి అనౌన్స్‌మెంట్లు వీరికి అస్సలు పట్టవు. అలాంటి పొగరాయుడు చేసిన పనికి విమానంలోని సిబ్బంది కాసేపు కంగారుపడిపోయారు. విమానంలో ఏదో జరుగుతుందని అనుమానించి చివరకు అది సిగరెట్ పొగ అని తెలుసుకుని రిలాక్స్ అయ్యారు. అహ్మదాబాద్ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా గోవా వెళుతున్న ఓ ప్రయాణికుడు... ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటి తరువాత టాయిలెట్‌లోకి వెళ్లి దమ్ముకొట్టడం మొదలుపెట్టాడు.

ఆ పొగ కాస్త సిబ్బంది దృష్టికి రావడంతో కొంతసేపు వాళ్లు హైరానా పడిపోయారు. అయితే ఓ ప్యాసింజర్ సిగరెట్ తాగడం వల్లే ఈ పొగ వచ్చిందని గుర్తించిన విమాన సిబ్బంది... వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం విమానాల్లో పొగ తాగడం నిషేధమని అతడికి స్పష్టం చేశారు. గోవాలో విమానం ల్యాండైన అనంతరం ఆ ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు విమాన సిబ్బంది. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు పొగ తాగేందుకు ప్రయత్నించడంతో... ఫ్లైట్ మూడు గంటల పాటు ఆలస్యమైంది.


First published: December 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>