Man Slits Wife Throat : కర్ణాటక(Karnataka)లో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగా కోర్టు ఆవరణలోనే భార్యను గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. అనంతరం ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా, చుట్టుపక్కలవారు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర ఫ్యామిలీ కోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది.
తట్టెకెరె గ్రామానికి చెందిన ఛైత్ర అనే మహిళకి.. శివకుమార్ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే రెండేళ్ల క్రితం దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భార్యా-భర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అప్పుడే విడాకులకు దరఖాస్తు చేసి భరణం చెల్లించాలని మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో శనివారం చైత్ర కోర్టుకు హాజరయ్యింది. హాసన్ జిల్లా హోలెనరసిపుర ఫ్యామిలీ కోర్టులో గంటపాటు కౌన్సెలింగ్ తర్వాత బయటకు రాగానే భార్య చైత్రపై శివకుమార్ దాడి చేశాడు. ఆమెను వెంబడించి వాష్‌రూమ్‌కు వెళ్లి కొడవలితో ఆమె గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న కొంతమంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన చైత్రను ఆసుపత్రికి తరలించగా ఆమెకు డాక్టర్లు కృత్రిమ శ్వాస అందించారు. అయితే భర్త గొంతు కోయడంతో చాలా రక్తాన్ని కోల్పోయిన చైత్ర చికిత్స పొందుతూ మరణించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Shocking : తన కుండలోని మంచినీళ్లు తాగాడని..దళిత విద్యర్థిని కొట్టి చంపిన టీచర్
శివకుమార్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేశారు. అయితే ఘటనకు కొన్ని నిమిషాల ముందు, కౌన్సెలింగ్ సెషన్‌లో ఛైత్ర-శివకుమార్ దంపతులు తమ విభేదాలను పక్కనబెట్టి తిరిగి కలవడానికి అంగీకరించినట్లు సమాచారం.కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఏమి జరిగింది మరియు అతను కోర్టు లోపల ఆయుధాన్ని ఎలా పొందగలిగాడు అని మేము పరిశీలిస్తాము హసన్ లోని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Husband kill wife, Karnataka