ఆన్‌లైన్‌లో షూస్ కోసం ఆర్డరిస్తే... ఏమైందో తెలుసా...

Online Shopping : స్మార్ట్ మొబైల్స్ వచ్చాక... ఆన్‌లైన్ షాపింగ్ అనేది ప్రజలకు బాగా అలవాటైంది. ప్రతీ వస్తువునూ ఆన్‌లైన్‌లో కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఓ కస్టమర్ అదే చేశాడు... అనుకోకుండా బుక్కయ్యాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: June 28, 2019, 12:14 PM IST
ఆన్‌లైన్‌లో షూస్ కోసం ఆర్డరిస్తే... ఏమైందో తెలుసా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుజరాత్‌... అహ్మదాబాద్‌లో... వెజాల్పూర్‌లో ఉంటున్నాడు బాధితుడు దినేష్ ఠాకూర్. ఓ ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌కి కనెక్టయ్యాడు. అందులో స్పోర్ట్స్ షూస్ కోసం ఆర్డరిచ్చాడు. వాటి రేటు రూ.1000. ముందుగా వెబ్‌సైట్‌లో షూస్ ఫొటో చూశాడు. ఆ ఫొటోలో షూస్ తెగ నచ్చేశాయి. వెంటనే వాటిని అమ్ముతున్న సెల్లర్‌కి కాల్ చేశాడు. మరిన్ని ఫొటోలు కావాలని అడిగాడు. తన వాట్సాప్ నంబర్ ఇచ్చాడు. వెంటనే ఆ సెల్లార్... కొన్ని ఫొటోలను వాట్సాప్‌కి పంపాడు. వాటితోపాటూ ఓ బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను పంపిన సెల్లార్... అందులో డబ్బు డిపాజిట్ చెయ్యమని కోరాడు. ఆ షూస్ కావాలంటే అడ్వాన్స్‌గా మనీ పే చెయ్యాలని చెప్పాడు. నిజమే అనుకున్న దినేష్... ఆ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా... సెల్లార్ బ్యాంక్ అకౌంట్‌లో మనీ చెల్లించాడు.

రెండ్రోజుల తర్వాత ఆ సెల్లార్ కాల్ చేసి... రెండు జతల షూస్ కొనుక్కోవాలనీ, ఒక జత విడిగా అమ్మడం కుదరదని అన్నాడు. వెంటనే దినేష్... తన కొలీగ్‌కి ఆ షూస్ ఫొటోలు పంపాడు. ఆ షూస్ చాలా బాగుండటంతో... ఫ్లాటైన కొలీగ్ సైతం... తను ఓ జత కొనుక్కుంటానని అన్నాడు. వెంటనే దినేష్ మరో రూ.1000 చెల్లించాడు. ఆ తర్వాత ఎన్నిరోజులైనా అడ్రెస్‌కి షూస్ రాలేదు. దాంతో తాను మోసపోయానని దినేష్‌కి అర్థమైంది.

వెంటనే సైబర్ సెల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వారు మొబైల్ నంబర్ ఆధారంగా... సెల్లార్‌ను కనిపెట్టారు. సెల్లార్ పేరుతో... ఇద్దరు కుర్రాళ్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని తేలింది. వాళ్లిద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు. ఇలా చాలా మందిని వాళ్లు మోసం చేశారు. ఇప్పటివరకూ రూ.35వేలు అడ్డగోలుగా కాజేశారని దర్యాప్తులో తేలింది.

First published: June 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>