MAN SHOOTS FELLOW MOVIEGOER AMIDST KGF SCREENING IN KARNATAKAS HAVERI PVN
OMG : కేజీఎఫ్-2 సినిమా చూస్తుండగా..కాలు తగిలిందని తుపాకీతో కాల్చేశాడు
ప్రతీకాత్మక చిత్రం
Gunfire While Watching KGF : ఇటీవల విడదలైన కేజీఎఫ్-2 సినిమా సరికొత్త రికార్డులను నమోదుచేస్తున్న విషయం తెలిసిందే. దేశ,విదేశాల్లో ఈ సినిమా చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడుతున్నారు. కొన్ని దేశాల్లో ఈ సినిమా టిక్కెట్ దొరకాలంటే రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి.
Gunfire While Watching KGF : ఇటీవల విడదలైన కేజీఎఫ్-2 సినిమా సరికొత్త రికార్డులను నమోదుచేస్తున్న విషయం తెలిసిందే. దేశ,విదేశాల్లో ఈ సినిమా చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడుతున్నారు. కొన్ని దేశాల్లో ఈ సినిమా టిక్కెట్ దొరకాలంటే రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. అశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్న కేజీఎఫ్-2 సినిమాను ప్రధర్శిస్తున్న ఓ థియేటర్ లో దారుణం జరిగింది. కేజీఎఫ్-2 సినిమా చూస్తుండగా కాలు తాకిందని వసంతకుమార్ అనే 27 ఏళ్ల యువకుడిని కాల్చాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని హవేరీలోని రాజశ్రీ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది. ఈ థియేటర్ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత నియోజకవర్గం హవేరీ జిల్లాలోని షిగ్గావ్ లో ఉంది.
షిగ్గావ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మొగలి గ్రామానికి చెందిన వసంతకుమార్ శివాపూర్(27) కన్నడ హీరో యశ్ కు వీరాభిమాని. యశ్ నటించిన కేజీఎప్-2 ఇటీవల విడుదలైన నేపథ్యంలో మంగళవారం పొలం పనులు ముగించుకొని రాత్రి తన స్నేహితులతో కలిసి కేజీఎఫ్-2 సినిమా చూసేందుకు రాజశ్రీ థియేటర్ కి వెళ్లాడు. అయితే సినిమా చూస్తున్న సమయంలో వసంతకుమార్..తన కాళ్ళను ముందు సీటుపై పెట్టాడు, దీంతో ఆ సీటులో కూర్చొన్న వ్యక్తి వసంతకుమార్ తో గొడవకి దిగాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు థియేటర్ నుంచి బయటికి వెళ్లి..మళ్లీ పిస్టల్ తో థియేటర్ లోకి వచ్చి సినిమా చూస్తున్న వసంతకుమార్ పై రెండుసార్లు కాల్పులు జరిపాడు. రెండుసార్లు కాల్పులు జరపడంతో వసంతకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రగాయాలపాలైన వసంతకుమార్ ని ట్రీట్మెంట్ నిమిత్తం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితుడైన వసంతకుమార్ కి గతంలో ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని.. నిందితుడుపరారీలో ఉన్నాడని.. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. లైసెన్స్ పొందిన తుపాకీ హోల్డర్ల జాబితా కూడా తనిఖీ చేయబడుతోంది అని పోలీసులు తెలిపారు.
నిందితుడు మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపారని, ఒకటి గాలిలోకి, రెండుసార్లు బాధితుడి కడుపుపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. . మొదటి రౌండ్ కాల్పులు జరగడంతో, వసంతకుమార్ స్నేహితులతో సహా థియేటర్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారని.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ట్రీట్మెంట్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.