Shocking News: కొన్ని రోజులుగా నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.. డాక్టర్ చెప్పింది విని..

బాధితుడు కేబ్

తనకు సంబంధించి మెడికల్ రిపోర్టులు వచ్చిన వెంటనే తన భార్య ఎరిన్‌కు విడాకులు ఇచ్చాడు. కేబ్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఎరిన్‌ను అరెస్ట్ చేశారు.

  • Share this:
    జీవితంలో అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్న సమయంలో కొన్ని విషయాలు వింటే గుండె పగిలినంత పనైపోతుంది. అసలు మన ఊహకు కూడా అందని విషయాలు వాస్తవంగా జరిగాయని తెలుసుకుంటే ఒంట్లో వణుకుపడుతుంది. అసలు ఇలా ఎందుకు జరిగిందని తెలుసుకుని.. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. కొందరైతే ఆ షాక్‌లోకి వెళ్లి.. మళ్లీ కోలుకోకుండానే అనారోగ్యం పాలవుతుంటారు. అమెరికాలో జరిగిన ఇలాంటి ఓ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దక్షిణ కరోలినాకు చెందిన 56 ఏళ్ల జేడీ మెక్ కేబ్ 17 ఏళ్ల క్రితం ఎరిన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు. కొద్ది నెలల క్రితం అభిప్రాయభేదాల కారణంగా కేబ్, ఎరిన్ విడిపోయారు.

    అమెరికాలో దంపతలు మధ్య విభేదాలు వస్తే విడాకులు తీసుకోవడం సహజమే కాబట్టి.. దీనిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే భార్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత కొద్ది రోజులకు కేబ్ బాగా నీరసంగా మారిపోయాడు. బాగా సన్నబడిపోయాడు. తన శరీరంలో వచ్చిన ఈ మార్పులకు, తన అనారోగ్యానికి కారణం తెలుసుకునేందుకు డాక్టర్ దగ్గరకు వెళ్లాడు కేబ్. అతడికి అనేక వైద్య పరీక్షలు చేసిన డాక్టర్.. అతడు ఊహించని విషయం చెప్పాడు.

    కొన్నేళ్లుగా నీపై విష ప్రయోగం జరుగుతోందని.. కొన్నేళ్లుగా ఆర్సెనిక్ అనే విషాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటున్నారని డాక్టర్లు చెప్పడంతో షాక్‌కు గురికావడం కేబ్ వంతైంది. అయితే అసలు ఆ విషయం తనకు ఎలా ఇస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాడు కేబ్. అప్పుడు కానీ అతడికి తన భార్య చేసిన కుట్ర అర్థం కాలేదు. ప్రతి రోజు తాను జిమ్ నుంచి వచ్చిన తరువాత భార్య ప్రోటీన్ షేక్ ఇచ్చేదని.. అందులోనే ఈ విషాన్ని కలిపి ఇచ్చిందని కేబ్ అనుమానించాడు.

    Telangana: ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ.. బ్యాలెన్స్ చేస్తున్న మాజీ ఎంపీ.. టార్గెట్ ఆ నాయకుడే..

    YS Jagan: ఏపీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు.. వారిచ్చే నివేదికలే సీఎం జగన్‌కు కీలకమా ?

    తనకు సంబంధించి మెడికల్ రిపోర్టులు వచ్చిన వెంటనే తన భార్య ఎరిన్‌కు విడాకులు ఇచ్చాడు. కేబ్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఎరిన్‌ను అరెస్ట్ చేశారు. సాధారణంగా కొంత అర్సెనిక్ తీసుకుంటేనే ప్రమాదమని.. అలాంటిది ఇన్నేళ్లుగా కేబ్‌కు ఆ విషాన్ని ఎలా ఇచ్చి ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. అసలు తన భర్త కేబ్‌పై విషప్రయోగం చేసి చంపాలనుకున్న ఎరిన్ అసలు ఉద్దేశ్యం ఏంటనే దానిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published: