చుట్టపు చూపుగా స్నేహితురాలి ఇంటికొస్తే, ఆమె భర్త చేసిన పనికి...

నమూనా చిత్రం

ఆ రోజు రాత్రి బాధితురాలు తన ఫ్రెండ్ ఇంట్లోనే బస చేసింది. తర్వాత రోజు ఉదయం బాధితురాలి ఫ్రెండ్ ఆఫీసుకి వెళ్లిపోయింది.

  • Share this:
    చుట్టపు చూపుగా స్నేహితురాలి ఇంటికి వస్తే యువతిని గర్భవతిని చేశాడో వ్యక్తి. గత ఏడాది జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ బెంగళూరులోని ఓ చిట్ ఫండ్ సంస్థలో డబ్బులు జమ చేసింది. ఆ డబ్బులు డ్రా చేసుకోవడం కోసం కొన్ని సార్లు బెంగళూరు రావాల్సి వచ్చింది. అయితే, గత ఏడాది డిసెంబర్‌లో ఆమె డబ్బులు తీసుకోవడంలో ఆలస్యమైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణం చేయడం మంచిది కాదని భావించిన యువతి.. బెంగళూరులోనే ఉండే తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆమె ఇంటికి వస్తానని చెప్పింది. ఆ రోజు రాత్రి బాధితురాలు తన ఫ్రెండ్ ఇంట్లోనే బస చేసింది. తర్వాత రోజు ఉదయం బాధితురాలి ఫ్రెండ్ ఆఫీసుకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఫ్రెండ్ భర్త తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తన భార్యకు చెబితే చంపేస్తానని బెదిరించినట్టు పేర్కొంది. అయితే, ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఇప్పుడు విషయం బయటకు వచ్చింది.
    First published: