Telangana: షాకింగ్.. కన్న కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం.. చివరకు ఆ కీచక తండ్రి జీవిత ఖైదీగా..

ప్రతీకాత్మక చిత్రం

మన దేశంలో రోజురోజుకు మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఎంత దారుణంగా సమాజం తురవుతుందంటే కన్న కూతురిని వదలడం లేదు వాయి వరుసలు లేని మృగాలు. అలాంటిదే మేడ్చల్ జ్లిల్లాలో కన్న కూతురిపై అత్యాచారం చేయగా న్యాయస్థానం అతడికి జీవితాంతం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

 • Share this:
  నిర్భయ నుంచి దిశ వరకు ఎన్నో సంఘటనలు జరిగినా కొత్త చట్టాలు అమలు చేస్తున్నా ఈ మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు.  చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇది ఇలా ఉంటే ఒక కామాంధుడు వాయి వరుసలు మరిచి కన్న బిడ్డ మీద అత్యాచారానికి యత్నించిన సంఘటన మేడ్చల్ మల్కజిగిరి జిల్లా కోంపల్లి సమీపంలోని ఓ కాలనీలో చోటుచేసుకుంది. కూతురి అలన పాలన చూడాల్సిన తండ్రి కూతురిపై కన్నేసి నాలుగు సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దూరపు చుట్టం ద్వారా విషయం వెలుగులోకి రావడంతో తండ్రిపై కేసు నమోదైంది. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ కామాంధుడికి జీవితకాలం శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి సమీపంలోని కాలనీకి చెందిన ఓ వ్యక్తి(40) భార్య చనిపోవడంతో కుమార్తె (17)తో కలసి ఉంటున్నాడు. తాగుడుకు బానిసై 2017లో కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి బాలిక గర్భం దాల్చడంతో ఓ ప్రైవేట్ వైద్యుని సూచనల మేరకు ట్యాబ్లెట్లు వేసి గర్భస్రావం చేయించాడు.

  తండ్రి ఆగడాలు తట్టుకోలేక బాలిక తన దూరపు బంధువుకు మొర పెట్టుకోవడంతో అతని పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ బాలిక వాంగ్మూలాన్ని మేడ్చల్ లోని 21 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తో నమోదు చేయించారు. కేసు విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి సురేష్  నిందితుడికి మరణించేంత వరకు జైల్లోనే ఉండే శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.  కఠినమైన చట్టాలు ఎన్ని తీసుకొస్తున్నా అమలులో ఉన్న లోపాల వల్ల నిందితులకు శిక్షలు పడడం లేదు. ఉదాహరణకు 2012లో నిర్భయ మీద అతి కిరాతకంగా ఆరుగురు మృగాళ్లు మీద పడి ప్రాణం తీసేశారు. సుప్రీం కోర్టు వారికి మరణ శిక్ష విధించింది. మరణశిక్ష పడ్డ తర్వాత కూడా 7 సంవత్సరాలుగా వారు బ్రతికే ఉన్నారు. అంటే మన చట్టాలు నిందితులకు అనుకూలంగా ఉన్నాయి. మరణ శిక్ష పడ్డవారు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవచ్చు. పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ దాన్ని రద్దు చేస్తే మళ్లీ రివ్యూ పిటిషన్ పెట్టుకోవచ్చు . ఈ అవకాశాలు ఉన్నందున తప్పు చేసిన వారికి శిక్షలు అమలులో ఎంతో జాప్యం జరుగుతుంది. ఇది నిందితులకు ఒక బ్రహ్మాస్త్రంలా మారింది. మరణశిక్ష విధించిన వారికి కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆ మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ ఉన్నారు. జీవిత ఖైదులో సత్ప్రవర్తన కింద మళ్లీ వారిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల తప్పు చేస్తే శిక్ష పడ్డ తప్పించుకోవచ్చని నిందితులు భావిస్తున్నారు. ఇంత దారుణంగా మన చట్టాలు ఉన్నాయి.

  సమాజంలో స్త్రీని చూసే పద్ధతి కూడా మారాలి. చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి నిందితులను త్వరగా శిక్షించాలి. నిందితులకు భయం కల్పించే విధంగా శిక్షలను అమలు చేసినప్పుడే తప్పు చేయాలి అనుకున్న వాడికి భయం వేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేసి నిందితులను వెంటవెంటనే శిక్షించినప్పుడే ఆడవాళ్లపై ఘోరాలు తగ్గుతాయి.
  Published by:Veera Babu
  First published: