సవతి కూతురుపై ఏడాది పాటు లైంగిక దాడి చేసి...తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్...

యువతి మాత్రం తనపై లైంగిక దాడికి పాల్పడింది...మరెవరో కాదని తన సవతి తండ్రే ఆ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు వెల్లడించింది. దీంతో పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు సవతి తండ్రిని అరెస్టు చేశారు.

news18-telugu
Updated: August 23, 2019, 4:39 PM IST
సవతి కూతురుపై ఏడాది పాటు లైంగిక దాడి చేసి...తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సవతి కూతురుపై వరుసగా లైంగిక దాడి చేసిన కేసులో ఓ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలోని థానేలో ఓ వ్యక్తి నవీ ముంబైలో తన కూతురు, భార్యతో సహా నివాసం ఉంటున్నాడు. అయితే తన కూతురుకు సవతి తండ్రి అవడంతో ఆమెపై కన్నేశాడు. పలుమార్లు ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయువతి తరచూ ప్రతిఘటిస్తూ వచ్చింది. చివరకు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లోబరుచుకొని ఏడాది పాటు లైంగిక దాడి చేశాడు. అయితే తన కుమార్తె ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుసుకొని, అతడిని సైతం దూరం చేసే ప్రయత్నం చేసేందుకు కుట్ర పన్నాడు. ఆ యువకుడు తన సవతి కుమార్తెపై లైంగిక దాడి చేసాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే యువతి మాత్రం తనపై లైంగిక దాడికి పాల్పడింది...మరెవరో కాదని తన సవతి తండ్రే ఆ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు వెల్లడించింది. దీంతో పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు సవతి తండ్రిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా, వాదోపవాదాలు విన్న తరువాత న్యాయస్థానం నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>