• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MAN SENDS WIFE OBSCENE PHOTOS VIDEOS TO HER BROTHER IN MADHYA PRADESH SU

భార్య అభ్యంతకర ఫొటోలు, వీడియోలు ఆమె సోదరుడికి పంపిన భర్త.. అసలు ఏం జరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి తన భార్య అభ్యంతకర ఫొటోలు, వీడియోలు ఆమె సోదరుడికి పంపించాడు. తాను చెప్పినట్టు చేయకపోతే ఆ ఫొటోలను అందరికి పంపి.. బహిర్గతం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

  • Share this:
    ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్నం వేధింపులు భరించలేక తాను భర్తకు దూరంగా ఉంటున్నానని.. అతడు మాత్రం వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. వరకట్న కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. ఈ క్రమంలోనే తన అభ్యంతరకరమైన ఫొటోలను, వీడియోలను సోదరుడికి పంపించాడని ఆరోపించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నాలుగేళ్ల క్రితం బాధిత మహిళకు గ్వాలియర్ ప్రాంతానికి చెందిన నిందితుడితో వివాహం జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే నిందితుడు ఆమెను కట్నం కోసం వేధింపులకు గురిచేశాడు. రెండేళ్ల పాటు నిందితుడు వేధింపులను అతని భార్య భరించింది.

    రెండేళ్లు గడిచినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించింది. కట్నం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం భర్త ఇంటిని వదిలి.. తల్లిదండ్రులతో కలిసి భోపాల్‌లో నివాసం ఉండసాగింది. ఇక, తనపై నమోదు చేసిన వరకట్నం కేసును ఉపసంహరించుకోవాలని ఆ మహిళను ఆమె భర్త బలవంతం చేశాడు. ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.

    పోలీసు అధికారి కొంపముంచిన వివాహేతర సంబంధం.. మహిళ ఫిర్యాదుతో విచారణ జరిపితే..

    Hyderabad: వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి.. కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలోని..

    13 ఏళ్ల బాలికపై ఐపీఎస్ అధికారి నీచపు పని.. చార్జ్ షీట్‌లో అభియోగాలు.. అంతలోనే ఊహించని విధంగా..

    ఈ క్రమంలోనే మహిళ అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలను ఆమె సోదరుడికి పంపించాడు. వాటిని అందరికి షేర్ చేసి బహిరంగ పరుస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే భర్తపై ఆమె మరోసారి పోలీసులకు ఆశ్రయించింది. భోపాల్‌లోని కోలార్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త నీతిమాలిన చర్యపై మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు.
    Published by:Sumanth Kanukula
    First published: