పేకాటలో భార్య తాకట్టు...రేప్ చేసుకోమని ఫ్రెండ్స్‌కు ఆఫర్ ఇచ్చిన భర్త

పేకాటలో ఓడిపోయిన సుశీల్ తన భార్యను స్నేహితులకు అప్పగించాడు. వారు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. భర్తే ఇలా చేయడంతో ఆమె బాధతో మేనమామ ఇంటి కెళ్లింది.

news18-telugu
Updated: July 1, 2020, 10:13 PM IST
పేకాటలో భార్య తాకట్టు...రేప్ చేసుకోమని ఫ్రెండ్స్‌కు ఆఫర్ ఇచ్చిన భర్త
యువతిపై గ్యాంగ్ రేప్...
  • Share this:
తాగుడు, పేకాటకు బానిస అయిన ఓ ప్రబుద్ధుడు భార్యను పందెం కాశాడు. బెట్టింగ్‌లో ఓడటంతో.. తన స్నేహితులకు భార్యను అప్పగించాడు. దీంతో వారు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. తన భర్త మద్యానికి బానిసై డబ్బు లేకపోవడంతో ఈ దారుణానికి ఒడిగొట్టినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెల్తే…ఉత్తరప్రదేశ్ లోని జాన్‌పూర్‌ ఈ సంఘటన జరిగింది. పేకాటలో ఓడిపోయిన సుశీల్ తన భార్యను స్నేహితులకు అప్పగించాడు. వారు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. భర్తే ఇలా చేయడంతో ఆమె బాధతో మేనమామ ఇంటి కెళ్లింది. తన వెనకే వచ్చిన భర్త మన్నించమని వేడుకోవడంతో మనసు మార్చుకొని తిరిగి వచ్చింది.

మార్గమధ్యంలో కారును నిలిపివేసిన నిందితుడు తన స్నేహితులను మరోసారి ఆమెపై లైంగిక దాడి చేయమని ప్రోత్సహించాడు. దీంతో తాగుడుకు బానిసైన తన భర్త జూదం కోసం డబ్బులు లేకపోవడంతో తనను పందెంగా పెట్టాడని బాధితురాలు వాపోయింది. భర్త స్నేహితుడైన అరుణ్, అతడి బంధువు అనిల్ తరచుగా తమ ఇంటికొచ్చి మందు తాగుతూ జూదం ఆడతారని చెప్పింది. ఒక రోజు తన భర్త పందెం కాశాడని.. ఓడటంతో.. అరుణ్, అనిల్ కలిసి తనను గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
First published: July 1, 2020, 10:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading