14 హత్యలు చేశా.. నేరం ఒప్పుకున్నా శిక్ష పడడం లేదు.. ఓ నిందితుడి వింత ఆవేదన

30 ఏళ్ల క్రితం హత్యలకు పాల్పడిన వ్యక్తి పేరు లీ చున్ జే. దక్షిణ కొరియాకు చెందిన లీ చున్, ఇన్నేళ్లు తనను పోలీసులు పట్టుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెబుతున్నాడు.

news18-telugu
Updated: November 3, 2020, 1:02 PM IST
14 హత్యలు చేశా.. నేరం ఒప్పుకున్నా శిక్ష పడడం లేదు.. ఓ నిందితుడి వింత ఆవేదన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణంగా ఏదైనా నేరం చేసిన వ్యక్తులు భయంతోనే బతుకుతారు. ఎప్పుడెప్పుడు పోలీసులు పట్టుకుంటారోననే ఆలోచన వారిని వేధిస్తుంది. పద్నాలుగు మంది మహిళలు, యువతులను చంపేసిన ఒక వ్యక్తి కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఇన్నాళ్లూ బతికాడు. కానీ అతడు చేసిన హత్యలను పోలీసులు గుర్తించకపోవడం విశేషం. 30 ఏళ్ల క్రితం హత్యలకు పాల్పడిన వ్యక్తి పేరు లీ చున్ జే. దక్షిణ కొరియాకు చెందిన లీ చున్, ఇన్నేళ్లు తనను పోలీసులు పట్టుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెబుతున్నాడు. తాను చేసిన నేరాలను శాశ్వతంగా దాచిపెట్టాలని అనుకోలేదని 57ఏళ్ల లీ దక్షిణ కొరియాలోని సువాన్ నగరంలోని కోర్టుకు తెలిపాడు. తాను మొత్తం 14మందిని హత్య చేసినట్టు గతేడాది మొదటిసారి అతడు చెప్పాడు.దక్షిణ కొరియా చట్టాలు అనుమానితులు, నేరస్థుల ప్రైవసీ హక్కుకు రక్షణ కల్పిస్తాయి. అందువల్ల నేరస్థుడి పూర్తి పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినందుకు నిందితుడికి గతంలో జీవితకాల శిక్ష పడింది. కానీ 20 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తరువాత, 2008లో  అతడు పెరోల్‌పై బయటకు వచ్చాడు.

సీరియల్ కిల్లర్‌గా పేరు..

1986 నుంచి 1991 మధ్య హ్వాసెంగ్ ప్రాంతంలో అతడు మొత్తం 10 హత్యలు చేశాడు. ఈ వరుస హత్యలను అక్కడి ప్రజలు హ్వాసెంగ్ మర్డర్స్ అని పిలుస్తారు. వీటితో కలిపి మొత్తం 14మందిని చంపినట్లు అతడు చెప్పాడు. కానీ ఈ హత్యలకు సంబంధించిన కేసులను పోలీసులు ఇంకా పరిష్కరించలేదు. ఈ సీరియల్ కిల్లింగ్స్‌పై 2003లో “Memories of Murder” పేరుతో ఒక సినిమా కూడా వచ్చిందంటే అవి ఎంత సంచలనం సృష్టించాయో చెప్పొచ్చు. “Parasite” సినిమాను చిత్రీకరించిన బాంగ్ జూన్ హో ఈ సినిమాను తెరకెక్కించాడు.

పోలీసులు పట్టుకోలేదు..
2019లో డీఎన్‌ఏ ఆధారాల సాయంతో పోలీసులు లీ చేసిన కొన్ని హత్యలపై దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. అతడిపై విచారణ కొనసాగుతోంది. హత్యల గురించి పోలీసులు తనను ప్రశ్నించారని లీ సోమవారం తెలిపాడు. తన చేతుల్లో హతమైన ఒక వ్యక్తి వాచ్‌ను ఇప్పటికీ  తీసుకువెళ్తున్నానని అతడు చెప్పడం విశేషం. కానీ పోలీసులు మాత్రం తన ఐడెంటిఫికేషన్ గురించి ఆరా తీసి, ఆ తర్వాత వదిలేసినట్టు చెబుతున్నాడు.

నేరాలు దాచాలనుకోలేదట..
పోలీసులు ఇంకా తాను చేసిన నేరాలను నిరూపించలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని లీ CNN వార్తాసంస్థతో చెప్పాడు. "హత్యల గురించి దాచడానికి నేను పెద్దగా ప్రయత్నించలేదు. అందువల్ల సులభంగా పోలీసులు నన్ను పట్టుకుంటారనుకున్నాను. ఇక్కడ వందలాది పోలీసు బలగాలు ఉన్నాయి. పోలీసులు నన్ను డిటెక్టివ్ ల వద్దకు తీసుకెళ్లారు. కానీ వారు నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించే ప్రతీసారి అడిగేవారు" అని లీ చెప్పినట్టు CNN తెలిపింది.

13 ఏళ్ల బాలికను హత్య చేస్తున్నప్పుడు తాను ఎలాంటి భావోద్వేగాలకు గురికాలేదని అతడు చెప్పాడు. తాను చేసిన హత్యలపై అనుమానంతో ఒక దివ్యాంగుడిని అరెస్టు చేశారని ఎవరో చెబుతుంటే విన్నానని లీ చెప్పాడు. కానీ తాను చేసిన హత్యల్లో దేనికి సంబంధించి అతడిని అరెస్టు చేశారో తెలియదని లీ ప్రకటించాడు. ఇప్పటికైనా అతడు హత్యలు చేసినట్టు పోలీసులు కోర్టులో నిరూపిస్తారో లేదో చూడాలి.
Published by: Nikhil Kumar S
First published: November 3, 2020, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading