హోమ్ /వార్తలు /క్రైమ్ /

మహిళలు స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి.. లైంగిక దాడి.. పైశాచికానందం తీరక..

మహిళలు స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి.. లైంగిక దాడి.. పైశాచికానందం తీరక..

ఈ క్రమంలో అతడికి రూ. 15000 ఇచ్చింది బాధితురాలు. అయితే అతడి నుంచి బెదిరింపులు ఆగలేదు. తనకు మరిన్ని డబ్బులు ఇవ్వాలని అతడు డిమాండ్ చేయడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఈ క్రమంలో అతడికి రూ. 15000 ఇచ్చింది బాధితురాలు. అయితే అతడి నుంచి బెదిరింపులు ఆగలేదు. తనకు మరిన్ని డబ్బులు ఇవ్వాలని అతడు డిమాండ్ చేయడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

వీడియోలతో మహిళలను బ్లాక్ మెయిలింగ్‌ చేసిన నిందితుడు.. వారిపై లైంగిక దాడి చేశాడు. ఆ తరువాత కూడా అతడి పైశాచిక ఆనందం తీరలేదు.

  మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు అరికట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా... నేరాలకు పాల్పడే వారిలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. స్నానం చేస్తున్న అమ్మాయిలు, వివాహిత ఫోటోలను తీసి ఓ కామాంధుడు.. అనంతరం వారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.తాను చెప్పినట్టు వినకపోతే నగ్న పోటోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్‌‌ చేసి లోబర్చుకుంటున్నాడు. జిల్లాలోని కులకచర్ల మండలం లాల్ సింగ్ తండాలో దారుణం చోటుచేసుకుంది.

  బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి మహిళలపై లైంగిక దాడి చేసిన తరువాత కూడా అతడి పైశాచిక ఆనందం తీరలేదు. అనంతరం ఆ ప్రైవేట్‌ వీడియోలను స్నేహితులకు పంపి వికృత చేష్టలకు పాల్పడ్డాడు నిందితుడు. అతడి వేధింపులు భరించే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత నెల 18న శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కొద్దిరోజుల క్రితం బెయిల్‌పై తిరిగి వచ్చిన శ్రీనివాస్‌, అతని సోదరుడితో కలిసి బాధితురాలి కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు.

  అంతటి ఆగకుండా తిరికి వారిపైనే అక్రమ కేసులు పెట్టించాడు. శ్రీనివాస్‌ను పోలీసులకు అండగా నిలుస్తున్నారని మహిళా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ వల్ల గ్రామంలో అశాంతి నెలకొందని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసుల తీరు సరిగ్గా లేదని.. పోలీసులు నిందితుడికి వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Blackmail, Crime, Telangana

  ఉత్తమ కథలు