తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని...కూతురిని అత్యాచారం చేసి...దారుణం...

ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇద్దరూ కలిసి సహజీవనం మొదలు పెట్టారు. కాగా సత్పాల్ సింగ్ కన్ను మహిళ కుమార్తెపై పడింది.

news18-telugu
Updated: August 8, 2020, 11:34 PM IST
తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని...కూతురిని అత్యాచారం చేసి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె మైనర్ కూతురిపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన పంజాబ్ లోని భటిండా లోచోటు చేసుకుంది స్థానికంగా నివసించే మహిళకు 2003లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కుటుంబ కలహాల నేపథ్యంలో గత పదేళ్లుగా భర్తతో విడిపోయిన మహిళ పిల్లలతో నివాసముంటోంది. ఈ క్రమంలో ఆదే ప్రాంతానికి చెందిన నివాసం ఉంటున్న సత్పాల్ సింగ్ అనే వ్యక్తి ఆ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇద్దరూ కలిసి సహజీవనం మొదలు పెట్టారు. కాగా సత్పాల్ సింగ్ కన్ను మహిళ కుమార్తెపై పడింది. దీంతో యువతికి మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా కొన్ని రోజులుగా కుమార్తె అనారోగ్యంగా ఉండడంతో ఏం జరిగిందని తల్లి ప్రశ్నించింది. సత్పాల్ తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది . బాధితురాలు, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Published by: Krishna Adithya
First published: August 8, 2020, 11:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading