హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

పోలాండ్ యువతిపై ఆరేళ్లుగా అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ దారుణం

పోలాండ్ యువతిపై ఆరేళ్లుగా అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ దారుణం

ప్రతీకాత్మక చిత్రం (image credit - twitter - ANI)

ప్రతీకాత్మక చిత్రం (image credit - twitter - ANI)

ఆమె బలహీనతను అతను క్యాష్ చేసుకున్నాడు. కన్నింగ్ ఆలోచనలతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. ఇప్పుడు ఆమె ధైర్యం చేసింది. అతనికి త్వరలోనే జైలు జీవితం తప్పదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పోలాండ్‌కి చెందిన ఓ యువతిపై.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఆరేళ్లుగా అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం తాజాగా బయటపడింది. ముంబై అంబోలీ ఏరియాలో జరుగుతున్న ఈ దారుణంపై... పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు. ఐతే.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

"భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్ల కింద ముంబైలోని అంబోలీ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు మనీష్ గాంధీపై కేసు నమోదైంది" అని ముంబై పోలీసులు తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తులో కొన్ని విషయాలు తెలిశాయి. "నిందితుడు 2016 నుంచి 2022 వరకూ బాధితురాలిపై చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు" అని బాధితురాలికి సంబంధించిన ఓ వ్యక్తి తెలిపారు.

"నిందితుడు ఎలా సంపాదించాడో గానీ... బాధితురాలికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు సంపాదించాడు. తాను చెప్పినట్లు వినకపోతే.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దాంతో బాధితురాలు నిస్సహాయురాలైంది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడినప్పుడు కూడా నిందితుడు ఫొటోలు తీశాడు" అలా ఆరేళ్లుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ... అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు" అని అధికారులు తెలిపారు.

First published:

Tags: Grapes, Maharashtra, Mumbai

ఉత్తమ కథలు