కూల్ డ్రింక్స్ కొనిపెడతానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం.. ఆ నేరం చేసింది మరేవరో కాదు..

ప్రతీకాత్మకచిత్రం

దేశంలో రోజురోజుకు మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

  • Share this:
    దేశంలో రోజురోజుకు మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిలో చాలా మంది మహిళలు, బాలికలకు తెలిసినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ బాలికపై ఆమె సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తన అమ్మమ్మకు జరిగిన ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌‌లోని రాంచీలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ బాలిక తన అమ్మమ్మ వద్ద రెండు నెలల నుంచి నివాసం ఉంటుంది. అయితే ఆదివారం బాలిక సవతి తండ్రి ఆమె ఉంటున్న చోటుు వెళ్లాడు. బాలికకు కూల్ డ్రింక్ ఇప్పిస్తానని చెప్పి.. బాలిక బయటకు తీసుకెళ్లాడు. అనంతరం బాలికను తీసుకుని నామ్‌కుమ్ రోడ్డు వైపు డ్రైవింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే బాలిక ఎక్కడికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్లిపోదాం అని చెప్పినప్పటికీ.. అతడు వినిపించుకోలేదు.

    తనకు కొంత పని ఉందని.. అది పూర్తి అయ్యాక కూల్ డ్రింక్స్ కొనిపెడతానని బాలికకు చెప్పాడు. ఆ తర్వాత నిందితుడు బాలికను రాంచీ శివార్లలోని ప్రముఖ దశమ్ ఫాల్స్‌ వద్దకు బాలికను తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఇంటికి బయలుదేరేటప్పుడు.. బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.

    ఆ తర్వాత ఇంటికి తిరిగివచ్చిన బాలిక.. జరిగిన విషయాన్ని తన అమ్మమ్మకు చెప్పింది. ఆ తర్వాత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు బాలికకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇక, బాలిక సవతి తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
    First published: