news18-telugu
Updated: October 8, 2020, 7:24 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఓ వ్యక్తి తన పొలంలో పనిచేసే మహిళ కూలీని రేప్ చేశాడు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఈ దారుణానికి ఓడిగట్టాడు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ జిల్లా అజ్నార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే మజ్దూర్ అధికార్ మంచ్ వర్కర్స్ ఆర్గనైజేషన్ సహాయంతో బాధితురాలు అహ్మదాబాద్‌లోని సబర్మతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో అధికారులు మంగళవారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని రాంచోడ్ అహీర్గా గుర్తించారు. అతనిపై ఐపీసీ 376(2), 354, 506లతో పాటుగా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
దాహోద్ ప్రాంతంలోని గిరిజన వ్యవసాయ కూలీలైన బాధితురాలు, ఆమె భర్త 2019 డిసెంబర్లో కచ్ ప్రాంతంలోని అజ్నార్ తాలుకాలో పొలం పనులు చేసేందుకు వలస వచ్చారు. మే 25 నుంచి వారిద్దరు మరో ఇద్దరు బంధువులతో కలిసి రాంచోడ్ అహీర్ పొలంలో పని చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారు అహీర్ స్థలంలోనే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే సెప్టెంబర్ 16న బాధితురాలు భర్త బయటకు వెళ్లిన సమయంలో రాంచోడ్ ఆమెను రేప్ చేశాడు. భర్త ఇంటికి తిరిగివచ్చాక.. రాంచోడ్ రేప్ చేసిన విషయాన్ని అతనికి తెలిపింది. దీంతో ఆ మరుసటి రోజు ఉదయమే వారు రూ. 1500కి మొబైల్ ఫోన్ అమ్మారు. తర్వాత అజ్నార్ నుంచి తమ ఊరు దహోద్కు బయలుదేరారు. ఆ తర్వాత మజ్జూర్ అధికార్ మంచ్ సహాయంతో వారు ఈ నేరం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"సెప్టెంబర్ 16 సాయంత్రం పని మీద నా భర్త ఊరిలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన సెల్‌ఫోన్ నా దగ్గర ఉంచి వెళ్లాడు. రాంచోడ్ అహీర్ నా భర్త ఫోన్‌ను కాల్ చేశాడు. కొంత పని చేయాల్సిందిగా అడిగాడు. అయితే నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని.. నా భర్త తిరిగి వచ్చాక ఆ పని చేస్తాడని చెప్పాను. ఆ తర్వాత కొంతసేపటికి రాంచోడ్ మా గుడిసె వద్దకు వచ్చాడు. కొన్ని పాలు తీసుకొచ్చిన రాంచోడ్ అవి ఇచ్చేందుకు వచ్చినట్టు తెలిపాడు. ఆ తర్వాత నాపై బలవంతంగా దాడి చేశాడు. రెండు సార్లు రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నా భర్తను చంపేస్తానని బెదిరించాడు" అని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
Published by:
Sumanth Kanukula
First published:
October 8, 2020, 7:24 AM IST