ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను నమ్మి బైక్ ఎక్కిన యువతికి షాక్...5 రోజులు దారుణంగా...

యువతిని బైక్ ఎక్కించుకొని లాంగ్ రైడ్ అంటూ బీచ్ వద్దకు తీసుకెళ్లాడు. ఊరికి దూరంగా నిర్మానుష్య సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి ఆ యువతిపై అత్యాచారం చేశాడు.

news18-telugu
Updated: August 8, 2020, 11:39 PM IST
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను నమ్మి బైక్ ఎక్కిన యువతికి షాక్...5 రోజులు దారుణంగా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన ఓ యువతి ఖాళీ సమయంలో గంటల తరబడి సోషల్ మీడియా సైట్లలో యాక్టివ్ గా ఉండటం అలవాటు చేసుకుంది. అయితే, ఈ యువతికి ఇటీవల ఓ చాటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. బిజినెస్ చేస్తున్నట్టు చెప్పాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఓ రోజు ఆ యువకుడు సరాసరి ఇంటి దగ్గరకు బైక్ మీద వచ్చాడు. ఆ యువతిని బైక్ ఎక్కించుకొని లాంగ్ రైడ్ అంటూ బీచ్ వద్దకు తీసుకెళ్లాడు. ఊరికి దూరంగా నిర్మానుష్య సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ యువతిని అక్కడే బంధించాడు. ఐదు రోజులుగా ఆ యువతి నరకం చూసింది. అయితే, యువతి మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు ఆ ఇంటికి సమీపంలో ఉన్న సిసిటీవీ ఫూటేజ్ నుపరిశీలించారు. యువతి ఓ బైక్ మీద వెళ్లినట్టు సిసిటీవీలో రికార్డ్ అయ్యింది. యువతికి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా, బీచ్ కు దగ్గర్లోని ఓ ఇంట్లో బందీగా బాధిత యువతి ఉందని ట్రేస్ చేయడంతో పాటు, బంధించిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Published by: Krishna Adithya
First published: August 8, 2020, 11:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading