భర్తను కోల్పోయిన స్నేహితుడి భార్య అనే కనికరం లేకుండా...ఉద్యోగం పేరుతో...దారుణం...

భర్త మ‌ర‌ణించిన కొద్దిరోజుల‌కే భర్త స్నేహితుడి కన్ను రీనాపై ప‌డింది. ఉద్యోగం ఇప్పిస్తానని న‌మ్మించి, ఆమెను మోసం చేశాడు. శారీర‌కంగా లోబ‌ర‌చుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెను లైంగికంగా వేధించేవాడు.

news18-telugu
Updated: July 12, 2020, 11:23 PM IST
భర్తను కోల్పోయిన స్నేహితుడి భార్య అనే కనికరం లేకుండా...ఉద్యోగం పేరుతో...దారుణం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి...అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జార్ఖండ్ కు చెందిన మోహన్ భ‌ర్త‌ను పోగొట్టుకున్న స్నేహితుడి భార్యకు అండ‌గా నిల‌వాల్సింది పోయి, ఆ మహిళ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. వితంతురాలైన యువతిపై అత్యాచారం చేశాడు. అతడి ఘాతుకాల‌ను భ‌రించ‌లేక‌.. బాధితురాలు తనపై జరుగుతున్న అత్యాచారాలను పోలీసుల‌కు తెలిపింది. రాంచీకి చెందిన రీనా( పేరు మార్పు)కు మూడేళ్ల కింద‌ట పెళ్ల‌యింది. అత్తామామ‌, భ‌ర్తతో పాటు ఆమెలో నివ‌సిస్తోంది. ఎనిమిది నెల‌ల కింద‌ట ఆమె భ‌ర్త మృతి చెందాడు. అత‌ను మ‌ర‌ణించిన కొద్దిరోజుల‌కే భర్త స్నేహితుడి కన్ను రీనాపై ప‌డింది. ఉద్యోగం ఇప్పిస్తానని న‌మ్మించి, ఆమెను మోసం చేశాడు. శారీర‌కంగా లోబ‌ర‌చుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెను లైంగికంగా వేధించేవాడు. అతడి చేష్టలను ఆమె భ‌రించ‌లేక పోయింది. ఈ క్రమంలో ఆ కీచకుడి అకృత్యాలను తన స్నేహితురాలికి చెప్పగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమెదు చేశారు.

సభ్య సమాజాన్ని తలవంపులకు గురి చేస్తున్న ఇలాంటి ఘటనలతో మానవత్వం అంతరించిపోతుందా...అని జనం భయపడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా మనుషుల్లోని పశు ప్రవృత్తి కారణంగా ఇలాంటి ఘోరాలు జరగుతున్నట్లు మానసిక విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఎలాంటి ప్రభావం లేకుండా పోతోంది. ఈ సందర్భంగా మహిళలు తమ ఆత్మ రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసులు ఇచ్చిన సూచనలు పాటించడం వల్ల ఇలాంటి నేరాలకు అరికట్టగలుగే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: July 12, 2020, 11:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading