Uncle Raped 16 Month Old Girl : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా అభం శుభం తెలియని ఏడాదిన్నర వయసు గల చిన్నారిపై సొంత మేనమామే అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి సోదరుడి ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ అమానవీయ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో జరిగింది.
పశ్చిమ బెంగాల్ నుంచి వలస వెళ్లిన కుటుంబం సిర్మౌర్లో కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం కుమార్తెకు పెళ్లి చేశారు. ఏడాది క్రితం ఆమెకు పాప పుట్టింది. ఆమె కూడా సిర్మౌర్ లోనే ఉంటోంది. వారి ఇంటి పక్కనే ఉండే చిన్నారి మేనమామ.. ఆమెను ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి చిన్నారి సోదరుడు తన చెల్లెలు ఏడుపు విన్నాడు. ఏడుస్తున్న చప్పుడు విని మేనమామ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. మేనమామ ఇంట్లోకి వెళ్లిన అతడు.. తన చెల్లెల్ని తీసుకుని వెళ్లి అక్కడ జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాడు. తండ్రిలా చూసుకోవాల్సిన మేనమామే. ఇలా చేయడంతో స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో వాళ్లందరు ఈ విషయం విని అవాక్కయ్యారు. ఇంట్లోని వ్యక్తి ఇలా చేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలను సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని నహాన్ వైద్య కళాశాలకు తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది.
ALSO READ Mayawati : మీ పార్టీ సంగతి చూసుకో ఫస్ట్..రాహుల్ విమర్శలకు మాయావతి స్ట్రాంగ్ కౌంటర్
మరోవైపు,హిమాచల్ ప్రదేశ్ లో ఓ దళిత యువకుడు మైనర్ బాలికను వేధించాడని గ్రామానికి చెందిన కొందరు అతడ్ని కట్టేసి కొట్టారు. తప్పు చేశాను బాబోయ్ అని ఒప్పుకున్నప్పటికి వదిలిపెట్టకుండా క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఈఘటనలో యువకుడి చేయి విరిగింది. గ్రామస్తులు కొడుతుండగా మరికొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. అత్యంత పాశవికంగా ఉన్న ఈఘటన హిమాచల్ ప్రదేశ్ ఉనాలోని హరోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అగ్రవర్ణాలకు చెందిన వాళ్లు తనను ఓ దళితుడిని అని చులకన చేసి కొట్టారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు వ్యక్తులపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Child rape, Himachal Pradesh, Rape case