కామకోరికలకు కూతురు బలి...ఆరు నెలలుగా అత్యాచారం..తండ్రి కాదు కీచకుడు...

తండ్రిగా బాధ్యతలు తీసుకోవాల్సిన అతని కన్ను కూతురిపై పడింది. తల్లి లేని సమయంలో సవతి కూతురిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆరు నెలలుగా రేప్ చేయడంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది.

news18-telugu
Updated: May 24, 2020, 6:41 PM IST
కామకోరికలకు కూతురు బలి...ఆరు నెలలుగా అత్యాచారం..తండ్రి కాదు కీచకుడు...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
గుజరాత్ లో ఘోరం జరిగింది. తమ కామవాంఛలు తీర్చుకోవడానికి ఓ కీచకుడు కూతురు పైనే కన్నేశాడు. తల్లిలేని సమయంలో..కూతురిపై పడి తన పశువాంఛ తీర్చుకునేవాడు. బాలిక ఆరోగ్యం బాలేకపోవడంతో.. ఆసుపత్రికి తీసుకెళితే ఆ బాలిక ప్రెగ్నెంట్ అని తేలింది. అయితే తన కుమార్తె ఇలా గర్భిణి అవడానికి కారణం తన భర్తే అని తెలియడంతో ఆమె తల్లి షాక్ తిన్నది. ఈ దారుణ ఘటన రాజ్‌కోట్ జిల్లాలో వెలుగుచూసింది. బీహార్ చెందిన రాజ్ పాల్ 13 ఏళ్ల క్రితం రాజ్‌కోట్ నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వితంతు మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 14 సంవత్సరాల కుమార్తె ఉంది. తండ్రిగా బాధ్యతలు తీసుకోవాల్సిన అతని కన్ను కూతురిపై పడింది. తల్లి లేని సమయంలో సవతి కూతురిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆరు నెలలుగా రేప్ చేయడంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. కొద్దికాలంగా బాలిక నీరసంగా ఉండడం గమనించిన తల్లి ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులకు అనుమానం వచ్చి పరీక్షలు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక ఇప్పుడు నాలుగు నెలల గర్భంతో ఉందని చెప్పడంతో తల్లి షాక్‌కు గురైంది. కూతురిని విచారించడంతో తండ్రి అరాచకం బయటపడింది. రెండేళ్లుగా తనను శారీరకంగా హింసిస్తున్నాడని చెప్పడంతో ఆ తల్లి షాక్‌కు గురైంది. భర్తపై ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
First published: May 24, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading