హోమ్ /వార్తలు /క్రైమ్ /

shocking : మనవరాలి శవం పక్కనే.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం -కసి ఈనాటిది కాదంటూ..

shocking : మనవరాలి శవం పక్కనే.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం -కసి ఈనాటిది కాదంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చనిపోయిన పాపను పూడ్చిపెట్టడానికి వెళ్లి.. ఆ శవాన్ని పక్కన పడేసి కూతురిని రేప్ చేసి, కసితీరా గొంతునులిమి చంపాడా దుర్మార్గుడు. వేరే కులం వాడిని పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందనే కక్షతోనే బిడ్డను అంత దారుణంగా..

పాలుతాగే పసిపాపను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న మహిళలపై ఆమె కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చనిపోయిన పాపను పూడ్చిపెట్టడానికి వెళ్లి.. ఆ శవాన్ని పక్కన పడేసి కూతురిని రేప్ చేసి, కసితీరా గొంతునులిమి చంపాడా దుర్మార్గుడు. వేరే కులం వాడిని పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందనే కక్షతోనే బిడ్డను అంత దారుణంగా హతమార్చాడా రాక్షస తండ్రి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సిటీ శివారులో చోటుచేసుకున్న ఈ ఘటనపై రతిబాద్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఉమేశ్ తివారి చెప్పిన వివరాలివి..

పని కోసం వేరే ఊళ్లో భర్త

భోపాల్ శివారు రతిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఈనెల 14న పాతికేళ్ల వయసున్న ఓ మహిళ, ఆమె పక్కనే పడున్న ఓ పసిపాప మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేయగా, ఆ మహిళ షాజాపూర్ జిల్లా కేంద్రానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మృతురాలి దగ్గర సెల్ ఫోన్ లేకపోవడంతో షాజాపూర్ లో ఆమె ఇంటి పొరుగువారి ద్వారా భర్త నంబర్ ను సంపాదించిన పోలీసులు.. అతనికి కాల్ చేసి విషయం చెప్పారు. ఉపాధి నిమిత్తం తాను కొంతకాలంగా రాయ్ పూర్(ఛత్తీస్ గఢ్)లో ఉంటున్నానన్న ఆ భర్త.. చివరిసారిగా దీపావళి రోజన భార్యతో మాట్లాడానని, అప్పుడామె తన అక్క ఇంట్లో ఉందని పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు..

దీపావళి పండక్కి వచ్చి

భోపాల్ శివారు రతిబాద్ ప్రాంతంలో ఉంటోన్న మృతురాలి అక్క ఇంటికి వెళ్లి ఆరాతీశారు. భర్త వేరే ఊళ్లో పనికి వెళ్లడంతో చెల్లెలు ఒక్కతే పాపతో ఉంటోది కదాని దీపావళి పండక్కి ఇంటికి(రతిబాద్) తానే రమ్మన్నానని, అయితే, అప్పటికే చెల్లెలి పాప న్యుమోనియా జ్వరంతో బాధపడుతున్నదని, దురదృష్టవశాత్తూ పండుగ మరుసటిరోజు (నవంబర్ 5న) తెల్లవారే పాప చనిపోయిందని ఆ అక్క పోలీసులకు చెప్పింది. పాప చనిపోయిన విషయం దూరంగా ఉన్న భర్తకు తెలిస్తే తట్టుకోలేడని భావించిన మహిళ.. ఇక్కడే పూడ్చి పెడదామని అక్కను కోరింది. అయితే అక్క మాత్రం అందుకు నాన్న సహాయం తీసుకుందామని చెప్పింది. ఏడాదిన్నర తర్వాత తండ్రిని ఇలాంటి పరిస్థితిలో కలవాల్సి వస్తుందని ఆ మహిళ ఊహించలేదు.

శవాన్ని పూడ్చడానికి వెళ్లి..

పెద్ద కూతురు ఫోన్ చేయడంతో ఆ తండ్రి (సేహోర్ జిల్లా బిల్కిస్ గంజ్ కు చెందిన వ్యక్తి) తన కొడుకును వెంటేసుకుని భోపాల్ శివారు రతిబాద్ కు చేరుకున్నాడు. పెద్ద కూతురిని ఇంట్లోనే ఉండమని, చిన్న కూతురు కూడా వస్తే.. పక్కనే ఉండ అడవిలో పాపను పూడ్చి వస్తామని బయటికి కదిలాడు. పాప చనిపోయిన విషయాన్ని రహస్యంగా ఉంచడంతో చుట్టుపక్కల వాళ్లెవరికీ అనుమానం కలగలేదు. కొడుకును డొంక దారిలోనే ఆగమని, అటువైపుగా ఎవరైనా వస్తే అలర్ట్ చేయమని ఆదేశించిన తండ్రి.. కూతురిని, మనవరాలి శవాన్ని తీసుకుని అడవిలోపలికి వెళ్లాడు. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక కూతురితో వాగ్వాదానికి దిగాడు..

కులం తక్కువ పని చేశావంటూ..

తక్కువ కులస్తుడిని ప్రేమించి, పారిపోయి పెళ్లి చసుకుందనే కోపంతో ఏడాదిన్నరగా చిన్న కూతురితో మాట్లాడని ఆ తండ్రి.. తీరా అలాంటి పరిస్థితిలో కూతురిని నిందించడం మొదలుపెట్టాడు. ‘కులం తక్కువ వాడితో పడుకొని బిడ్డను కన్నందుకు నీకు సరైన శాస్తి జరిగింది. ఇన్న రోజులూ ఊళ్లో వాళ్లూ నానా రకాలుగా అవమానిస్తుంటే నేను, అమ్మా, మీ అన్న ఎంత బాధను అనుభవించామో నీకు తెలియాలి.. ’అంటూ కూతురిని దూషించాడా తండ్రి. చేతిలో పాప శవాన్ని పెట్టుకుని ఎదురుమాట్లాడలేక వెక్కివెక్కి ఏడుస్తూ ఉండిపోయిందా మహిళ..

శవం పక్కనే కూతురిపై రేప్

కడుపారా కూతుర్ని శాపనార్థాలు పెట్టిన ఆ తండ్రికి నోటి కొచ్చిన బూతులన్నీ తిట్టినా కోపం చల్లారలేదు. కులం తక్కువ వాటిని పెళ్లి చేసుకుని నా పరువు తీశాని గట్టిగా అరుస్తూ ఉక్రోషంతో ఆమెను కిందికి నెట్టేశాడు. ఆ కుదుపుకు చేతిలో బిడ్డ శవం పక్కన పడటంతో ఆ మహిళ దీనంగా రోదిస్తూ దాన్ని అందుకునే ప్రయత్నం చేసింది. అప్పుడా తండ్రి మరింత కర్కషంగా కూతుర్ని తంతూ, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిన్నరగా కలి రగిలిపోతోందంటూ కూతురి పట్ల పైశాచికంగా ప్రవర్తించిన తండ్రి.. చివరికి ఆమెను గొంతునులిమి చంపేశాడు. రెండు శవాలనూ అడవిలోని తుప్పల్లో వదిలేసి వెళ్లిపోయాడు..

పరువు హత్యలో అరెస్టులు

కులం తక్కువవాణ్ని పెళ్లి చేసుకుందనే కోపంతో కూతురిపై ప్రతీకారం కోసం తండ్రి ఏడాదిన్నరగా ఎదరుచూస్తోన్న సంగతి అతని కొడుక్కి, పెద్ద బిడ్డకు తెలుసని, నవంబర్ 5న హత్యాచారం జరగ్గా, 14వ తేదీన మృతదేహాలను గుర్తించామని, దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి, విచారించగా, చిన్న కూతుర్ని తానే చంపినట్లు తండ్రి నేరాన్ని అంగీకరించాడని, అయితే రేప్ విషయాన్ని మాత్రం అతను కుటుంబీకులకు చెప్పలేదని పోలీసులు వివరించారు. ఈ ఘటనలో కూతుర్ని పరువుహత్య చేసిన తండ్రిపై హత్య కేసు పెట్టామని, అతనికి సహకరించిన కొడుకుపైనా కేసు పెట్టామని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని రతిబాద్ పోలీసులు చెప్పారు. దీనిని పరువు హత్యగా పేర్కొంటూ మీడియా కథనాలు వచ్చాయి.

First published:

Tags: Honor Killing, Madhya pradesh, Rape and murder

ఉత్తమ కథలు