Home /News /crime /

MAN RAPES DAUGHTER AT GURUGRAM HOTEL AFTER TAKING ON PRETEXT OF JOB INTERVIEW SU

వీడసలు మనిషేనా..? కూతురిని ఉద్యోగం పేరుతో హోటల్‌ రూమ్‌కు తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే నీచానికిక పాల్పడ్డాడు. హోటల్ రూమ్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు.

    కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే నీచానికిక పాల్పడ్డాడు. హోటల్ రూమ్‌లో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ షాకింగ్ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి.. బాధిత యువతి, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 7వ తేదీన గురుగ్రామ్‌లోని DLF-3లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన 48 ఏళ్ల ఓ వ్య‌క్తి టెక్స్‌టైల్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే అతను కొద్ది రోజులుగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే అతని 22 కూతురు ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలవాలని భావించింది. ఈ క్రమంలోనే యువతి తండ్రి జాబ్ కోసమని చెప్పి ఆమెను హోటల్‌‌కు తీసుకెళ్లాడు. అక్కడ హోటల్ రూమ్‌లో హెచ్‌ఆర్ టీమ్ ఉందని చెప్పాడు.

    దీంతో యువతి తండ్రితో కలిసి హోటల్‌కు చేరుకుంది. అనంతరం హోటల్‌లోని ఓ రూమ్‌కు వెళ్లాక.. అతడు కూతురు చేతులను కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియో కూడా తీశాడు. వాటిని కూతురిని చూపించి బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోలను సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాడు. ఇది జరిగిన తర్వాత యువతి, ఆమె తండ్రి హోటల్‌ నుంచి ఇంటికి చేరారు.

    పెళ్లయిన మహిళతో పెళ్లి.. కదులుతున్న రైల్లో కుంకుమ పెట్టి.. టాయిలెట్ పక్కన..

    క్లాస్‌రూమ్‌లో టీచర్ పాడుపని.. సాయం చేసిన మరో టీచర్.. ఆ నీచపు పని వల్ల..

    ఈ ఘటనతో బాధిత యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఇక, తల్లితో కలిసి కూరగాయలు కొనేందుకు బయటకు వెళ్లిన సమయంలో.. ఈ విషయాన్ని తల్లికి చెప్పి బోరున విలపించింది. దీంతో వారిద్దరు కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. హోటల్‌లో జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రిపై ఐపీసీ సెక్షన్ 376తో పాటు ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Delhi, RAPE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు