పేరుకి ప్రేమ... తెరవెనక అత్యాచారం... పోలీసుల్ని ఆశ్రయించిన యువతి

మన దేశంలో డైరెక్టుగా రేప్‌లు చేస్తున్నవారు కొందరైతే... ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడేవాళ్లు మరికొందరు. అలాంటి ఓ కేసు ఒంగోలులో నమోదైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 10:39 AM IST
పేరుకి ప్రేమ... తెరవెనక అత్యాచారం... పోలీసుల్ని ఆశ్రయించిన యువతి
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 10:39 AM IST
ప్రకాశం జిల్లా... పోలీస్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు జి.కోటిరెడ్డి. ఏడాది కిందట గుంటూరులోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న అమ్మాయిని చూశాడు. నచ్చింది. ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలనుకున్నాడు. మంచి ఉద్యోగం, హై శాలరీ అంటూ కటింగ్స్ ఇస్తూ... మొత్తానికి దగ్గరయ్యాడు. మొదట ఫ్రెండ్షిప్, తర్వాత ప్రేమ అన్నాడు. అప్పటివరకూ ఈ ప్రేమా, దోమలు కుట్టని ఆ యువతికి... అతని పరిచయం ఎంతో ఆనందం కలిగించింది. సినిమాలు, షికార్లకు తీసుకెళ్తుంటే... అదే ప్రపంచం అనుకుంది. ఇలా వన్ ఇయర్ ప్రేమ పేరుతో బాగానే నాటకాలు ఆడాడు. ఇలా ఎన్నాళ్లు... ఇంట్లో వాళ్లకు తెలిస్తే ప్రమాదం. మా వాళ్లైతే అస్సలు ఊరుకోరు. వెంటనే పెళ్లి చేసుకుందాం అంది. దాందేముంది చేసేసుకుందాం అన్నాడు. గుండెల్లో ఏదో భారం దిగిపోయినట్లు ఫీలైంది.

ఒంగోలులో ఉండే కోటిరెడ్డి... ఈ నెల 8న గుంటూరులోని ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లాడు. ఇప్పుడే, ఈ క్షణమే పెళ్లి చేసుకుందాం పద అన్నాడు. క్లాస్ రూంలోంచీ అలా అతని వెంట వెళ్లిపోయింది. అందరిలోనూ ఆశ్చర్యం.

ఒంగోలు... నిర్మల్‌ నగర్‌లోని ఓ గదిలో ఆమెను బంధించాడు. మరి కొన్ని గంటల్లో మన పెళ్లి అన్నాడు. ఈ గదిలో ఉన్నది మనిద్దరమే... నీకేమనిపిస్తోంది అన్నాడు. ఆమె నోట మాట లేదు. ఆ క్షణం ఆమె దగ్గరకు జరిగాడు. ఇవన్నీ పెళ్లి తర్వాతే అంది. ఇవాళేగా జరిగేది... దానికెందుకు టెన్షన్ పడతావ్... డోంట్ వర్రీ అంటూ... కిటికీ కర్టెన్ మూసేశాడు.

రెండ్రోజుల పాటూ... ఆమెను రేప్ చేసిన కోటిరెడ్డి... జులై 10న పరిస్థితులు బాలేవు. నువ్వు గుంటూరు వెళ్లిపో అన్నాడు. నన్ను పెళ్లి చేసుకో అంది. తర్వాత చూద్దాం అన్నాడు. నన్ను మోసం చేయవద్దు అంది. నాకు ఆసక్తి లేదు అన్నాడు. దుర్మార్గుడా... నా జీవితంతో ఆడుకున్నావ్... అని ఫైర్ అయ్యింది. ఏం చేస్తావో చేసుకో... పెళ్లి చేసుకోను... అంటూ... గదిలోంచీ గెంటేశాడు.



ఒంగోలు పోలీసుల్ని ఆశ్రయించింది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. యువతిని ఒంగోలులోని హోంకి తరలించి... పరారీలో ఉన్న కోటిరెడ్డి కోసం గాలిస్తున్నారు.
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...