మరో వారంలో నా పెళ్లి ఉంది...ప్లీజ్ నన్ను వదలిపెట్టండి..అన్నా వినకుండా...నర్సును రేప్ చేసి వీడియో తీసి...దారుణం

ఆమె నైట్ డ్యూటీలో తన విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుండగా, దారిలో ఆమెను బలవంతంగా అడ్డుకొని మరో ఇద్దరితో కలిసి రేప్ చేశాడు. పశువుల్లా మీదపడి కామవాంఛలు తీర్చుకున్నారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలు తీసి పైశాచికం ప్రదర్శించారు.

news18-telugu
Updated: October 21, 2020, 11:28 PM IST
మరో వారంలో నా పెళ్లి ఉంది...ప్లీజ్ నన్ను వదలిపెట్టండి..అన్నా వినకుండా...నర్సును రేప్ చేసి వీడియో తీసి...దారుణం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆసుపత్రిలో పనిచేసే ఓ నర్సుపై ఆమె సహోద్యుగులే అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన యూపీలోని షామ్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కంధ్లా పట్టణంలో షర్మిలా(పేరు మార్చాం) అనే యువతి స్థానిక ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రాధేశ్యాం అనే వ్యక్తి ఫార్మాసిస్టుగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో రాధేశ్యాం ఆమెను ప్రేమించమని వేధించేవాడు. దీంతో ఆమె తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అల్లరి చేసి తన జీవితాన్ని నవ్వుల పాలు చేయొద్దని ప్రాధేయపడింది. అయినప్పటికీ రాధేశ్యాం వినలేదు. ఆమెను మరింత వేధించసాగాడు. ఎలాగో పెళ్లి చేసుకుంటున్నావు...కదా...నా కోరిక తీర్చు అంటూ వేధించాడు. రాధేశ్యాం వేధింపులు భరించలేక షర్మిల ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆసుపత్రి యాజమాన్యం రాధేశ్యాంను పిలిచి మందలించింది. ఇంకోసారి ఇలా చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించిందది. దీంతో అతడు షర్మిలపై మరింత కసి పెంచుకున్నాడు. ఈ లోగా షర్మిల తన తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్పింది. వచ్చే నెల ఆమె వివాహం నిశ్చయమైంది. సంతోషంతో షర్మిల ఆసుపత్రిలో తన స్నేహితులందరికీ పెళ్లి కార్డులు పంచి పెట్టింది. అయితే ఆమె పెళ్లి నిశ్చమైందని పగతో రగిలిపోయిన రాధేశ్యాం ఆమె జీవితాన్ని ఎలాగైనా పాడు చేయాలనుకున్నాడు.

గత వారం ఆమె నైట్ డ్యూటీలో తన విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుండగా, దారిలో ఆమెను బలవంతంగా అడ్డుకొని మరో ఇద్దరితో కలిసి రేప్ చేశాడు. పశువుల్లా మీదపడి కామవాంఛలు తీర్చుకున్నారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలు తీసి పైశాచికం ప్రదర్శించారు. ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి వేధించడం మొదలుపెట్టారు. మృగాళ్ల వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన సహ ఉద్యోగులు రేప్ చేశారని.. ఆ దారుణాన్ని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది.
Published by: Krishna Adithya
First published: October 21, 2020, 11:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading