ప్రేమ పెళ్లి అంటూ విద్యార్థినిని లాడ్జికి తీసుకెళ్లిన లెక్చరర్...కానీ అంతలోనే...

అప్పటికే పెళ్లైన ఓ లెక్చరర్‌.. యువతిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని , తన కోరికను తీర్చాలంటూ వేధించసాగాడు. అయితే లెక్చరర్ మంచి వాడు అనుకొని నమ్మిన బాధితురాలు, అతడి ప్రేమకు ఓకే చెప్పింది.

news18-telugu
Updated: August 9, 2020, 11:57 PM IST
ప్రేమ పెళ్లి అంటూ విద్యార్థినిని లాడ్జికి తీసుకెళ్లిన లెక్చరర్...కానీ అంతలోనే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
దేశంలో అత్యాచారాలను నిర్మూలించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఓ డిగ్రీ విద్యార్థినిపై కన్నేసిన ఓ లెక్చరర్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. రెండో సారి కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో తాను మోసపోయానని తెలుసుకున్న విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీరట్ కు చెందిన లెక్చరర్‌ చంద్రశేఖర్ ( పేరు మార్చాం) 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థినిని ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తోంది. కాగా, అప్పటికే పెళ్లైన ఓ లెక్చరర్‌.. యువతిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని , తన కోరికను తీర్చాలంటూ వేధించసాగాడు. అయితే లెక్చరర్ మంచి వాడు అనుకొని నమ్మిన బాధితురాలు, అతడి ప్రేమకు ఓకే చెప్పింది. దీనిని ఆసరాగా చేసుకున్న లెక్చరర్‌ పెళ్లి పేరుతో మభ్యపెట్టి తన కోరికను తీర్చుకున్నాడు.

పట్టణంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి మొదటిసారిగా లైంగిక దాడికి పాల్పడగా, గత వారం సొంత ఇంటి వద్దకు తీసుకెళ్లి రెండో సారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని నిలదీసింది. అందుకు అతడు తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. ఈక్రమంలో లెక్చరర్ కు అంతకు ముందే పెళ్లి అయ్యిందనే సంగతి యువతికి తెలిసింది. దీంతో తనను మోసం చేస్తున్నాడని గమనించిన యువతి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సదరు లెక్చరర్‌ గతంలో పలువురు విద్యార్థినులపై కూడా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
Published by: Krishna Adithya
First published: August 9, 2020, 11:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading