వివాహితకు ఉద్యోగం ఇప్పిస్తానని...ఫ్లాటుకు రమ్మని...అయ్యో పాపం...

ఈ క్రమంలో భర్త స్నేహితుడైన న్యాయవాది శరణ్ సింగ్ సహాయం చేస్తానని నమ్మించి బాధితురాలిని తన ఫ్లాటుకు పిలిపించుకున్నాడు.

news18-telugu
Updated: May 23, 2020, 9:44 PM IST
వివాహితకు ఉద్యోగం ఇప్పిస్తానని...ఫ్లాటుకు రమ్మని...అయ్యో పాపం...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భర్త స్నేహితుడు సాయం చేస్తాడని నమ్మి వచ్చిన ఓ వివాహిత దారుణంగా మోసపోయింది. సాయం చేస్తానని చెప్పి అతను కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై అఘాయిత్యం చేశాడు. అంతేకాదు ఈ దృశ్యాలను చిత్రీకరించి తాను చెప్పినట్టు వినకపోతే సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇక తన వేదింపులు భరించలేని ఆ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే… బాధితురాలి భర్త నోయిడాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. అయితే అతను ఇటీవల కాలంలో మృతి చెందాడు. దీంతో సర్వీసులో మరణించినందున భర్త ఉద్యోగం కోసం బాధితురాలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భర్త స్నేహితుడైన న్యాయవాది శరణ్ సింగ్ సహాయం చేస్తానని నమ్మించి బాధితురాలిని తన ఫ్లాటుకు పిలిపించుకున్నాడు. అక్కడే బాదితురాలిని శరణ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియోను కూడా చిత్రీకరించి, ఈ విషయాన్ని బయటకు చెబితే సోషల్ మీడియాలో వీడియోను బయటపెడతానని బెదిరించాడు. అంతేకాదు తన కోరిక తీర్చమని పలు మార్లు అత్యాచారం చేశాడు. చివరకు తన స్నేహితుల కోరికలు తీర్చమని వెంటపడ్డాడు. దీంతో బాధితురాలు ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
First published: May 23, 2020, 9:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading