హోమ్ /వార్తలు /క్రైమ్ /

23 ఏళ్ల యువతిపై రేప్... వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి...

23 ఏళ్ల యువతిపై రేప్... వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి...

అయితే బాధిత మహిళ చికిత్స పొందుతున్న సమయంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ 

సంఘటనపై  కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆగ్రహంతో ఉండడంతో గ్రామంలో టెన్షన్ వాతవరణం 

నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే బాధిత మహిళ చికిత్స పొందుతున్న సమయంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ సంఘటనపై కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆగ్రహంతో ఉండడంతో గ్రామంలో టెన్షన్ వాతవరణం నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Gurugram : ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుగ్రామ్‌లో నేరాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తున్న అక్రమార్కులు... అన్యాయాలకు పాల్పడుతున్నారు.

హర్యానా... గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది 23 ఏళ్ల శ్రేష్ట (పేరు మార్చాం). రోజూ లాగే ఆఫీస్‌కి స్కూటీపై వెళ్తుండగా... ఆమెకు అనౌన్ కాల్ వచ్చింది. హెల్మెట్ తీసి... కాల్ రిసీవ్ చేసుకుంటే... నీ వాట్సాప్‌కి ఓ వీడియో పంపాను... ముందు అది చూడు... అని కాల్ కట్ చేశాడు అవతలి వ్యక్తి. ఏంటా అని వాట్సాప్ చూసుకుంది. అందులో పైన ఓ తెలియని నంబర్ నుంచీ ఏదో వీడియో వచ్చింది. అదేంటా అని ప్లే చేసింది. షాకైంది. అది తన వీడియోనే. బాత్‌రూంలో స్నానం చేస్తున్న వీడియో. 10 సెకండ్ల క్లిప్. ఒక్కసారిగా ఆమె కాళ్లూ, చేతులూ వణికాయి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే... సడెన్‌గా మళ్లీ అదే ఫోన్ కాల్... భయపడుతూ రిసీవ్ చేసుకుంది. వీడియో చూశావుగా... అది చిన్న క్లిప్పే... అసలు వీడియో చాలా పెద్దదే ఉంది. నేను చెప్పిన హోటల్‌కి రాకపోతే... ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అన్నాడు అవతలి వ్యక్తి. ఈ విషయం ఎవరికైనా చెప్పావో... చంపేస్తా అని కాల్ కట్ చేశాడు.

ఏం చెయ్యాలో శ్రేష్టకి అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని చాలా మదనపడింది. ఆఫీస్‌కి వెళ్లిందే గానీ... పనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేకపోయింది. రెండ్రోజుల తర్వాత కాల్ చేశాడు. ఏం నిర్ణయించుకున్నావ్ అని అడిగాడు. దయచేసి ఆ వీడియోని డిలీట్ చేసేయండి ప్లీజ్ అని బతిమలాడింది. అలా చెయ్యాలంటే... తాను చెప్పిన హోటల్ రూంకి రావాలన్నాడు. వద్దని ఎన్నోసార్లు కోరింది. కుదరదన్నాడు. వీడియో గనక బయటపడితే... అందరికీ తెలుస్తుంది. మీ తల్లిదండ్రులకు తెలిస్తే, తల ఎత్తుకొని తిరగలేరు. జస్ట్ ఒక్కసారి వచ్చావంటే... ఇక జీవితంలో నీ జోలికి రాను. నీ ముందే వీడియోని డిలీట్ చేస్తాను. అంటూ ఆలోచించుకోమని కాల్ కట్ చేశాడు.

మరో రెండ్రోజులు మదనపడిన శ్రేష్ట... వీడియో గనక బయటకు వస్తే... అందరూ తనను ఆదోలా చూస్తారనీ, దాని కంటే... అతని దగ్గరకు వెళ్లి... వీడియో డిలీట్ చేయించేసుకోవడమే మంచిదని అనుకుంది. అతనికి కాల్ చేసి... అతను చెప్పిన హోటల్‌ రూంకి వెళ్లింది. అతను ఎవరో కాదు... ఇంతకు ముందు వేరే ఆఫీస్‌లో తనతో పనిచేసిన కొలీగ్ జాన్ అని అర్థమైంది. మంచివాడిలా నటించి... అప్పట్లో ఆఫీస్ వాళ్లంతా టూరిజం ట్రిప్‌కి వెళ్లినప్పుడు... అక్కడి హోటల్‌లో ఆమె స్నానం చేస్తున్నప్పుడు... సీక్రెట్‌గా మొబైల్‌తో వీడియో తీశాడని ఆమెకు అర్థమైంది. ఆమె బలహీనతను క్యాష్ చేసుకున్న జాన్ ఆమెను శారీరకంగా అనుభవించాడు. ఆ తర్వాత ఆమె చూస్తుండగా... తన మొబైల్‌లో వీడియోని డిలీట్ చేశాడు. ఇక నీ జోలికి రాను అన్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ... లోలోపల కుమిలిపోతూ... ఎగసివచ్చే కన్నీటిని అణచివేసుకుంటూ... ఆ హోటల్ రూం నుంచీ వెళ్లిపోయింది శ్రేష్ట.

వారం తర్వాత... మళ్లీ కాల్ చేశాడు. తాను డిలీట్ చేసింది కాపీ వీడియో అనీ, అసలు వీడియో వేరే ఉందనీ, తన దగ్గరకు రాకపోతే... దాన్ని నెట్‌లో పెడతానని బెదిరించాడు. బ్లాక్ మెయిల్ సీన్ రిపీటవుతుండటంతో... భరించలేకపోయిన శ్రేష్ట... నీ అంతు చూస్తా అని కల్ కట్ చేసి... మొబైల్ స్విచ్ఛాఫ్ చేసింది. ఆఫీస్‌కి వెళ్లకుండా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. కంప్లైంట్ ఇచ్చింది. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు... పారిపోయిన జాన్ కోసం వేటాడుతున్నారు.

First published:

Tags: Case, Crime, Haryana, Police, RAPE

ఉత్తమ కథలు