విశాఖలో మహిళపై దారుణం... అత్యాచారం చేసి న్యూడ్ ఫోటోలు తీసి..

ఆ నీఛుడు ఆమె నగ్న ఫోటోలను తన స్నేహితుడికి ఇచ్చి.. అతని ద్వారా కూడా ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: November 26, 2019, 7:50 AM IST
విశాఖలో మహిళపై దారుణం... అత్యాచారం చేసి న్యూడ్ ఫోటోలు తీసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖలో రోజురోజుకు దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ఆ మధ్యలో హనీ ట్రాప్ గ్యాంగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గిఫ్ట్‌లంటూ జనాల్ని బురిటీ కొట్టిస్తున్న మరో గ్యాంగ్‌ను వెలుగులోకి తీసుకొచ్చారు. తాజాగా విశాఖలో చోటుచేసుకున్న మరో దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి ఓ కీచకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ ఆతర్వాత కూడా పాపం ఆమెపై పలుసార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా తనకు డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు దిగాడు. పలుసార్లు డబ్బులు ఇచ్చినా అతడి వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విశాఖకు చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. దీంతో ఆమెను ట్రాప్ చేసిన ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో క్లోజ్‌గా ఉండటం మొదలుపెట్టాడు. ప్లాన్ ప్రకారం ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతర్వాత ఆమెను నగ్నంగా ఉన్న ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. డబ్బు కావాలంటూ బెదిరించాడు. పరువు పోతుందని భావించిన బాధితురాలు... అప్పులు చేసి మరీ అతగాడికి రూ.50 లక్షల వరకు డబ్బు తెచ్చి ఇచ్చింది. ఈ దారుణానికి అతడి తల్లిదండ్రులు కూడా వంతపాడారు. కొడుకు చేస్తున్న అరాచకాలను ఆపాల్సిందిపోయి... డబ్బు తేవాలంటూ వారుసైతం ఆమెను బెదిరించారు. అంతటితో ఆగకుండా ఆ నీఛుడు ఆమె నగ్న ఫోటోలను తన స్నేహితుడికి ఇచ్చి.. అతడి ద్వారా కూడా డబ్బు వసూలు చేయించాడు. తర్వాత బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

First published: November 26, 2019, 7:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading