ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా... జనంలో మాత్రం మారడం లేదు. తాజాగా గుంటూరులో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి కొలనుకొండలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఉర్దూలో హోమ్ ట్యూషన్ పాఠాలు చెప్పే మైనర్ బాలిక పై గత 6 నెలలుగా ఈ దారుణం కొనసాగుతొంది. పాఠాలు చెప్పేందుకు ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి
కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అదే గ్రామానికి చెందిన సయ్యద్ ఖాసీంవలి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే విషయం బయటకి పొక్కటంతో మత పెద్దలతో రాజీ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం బాలికను గుంటూరు జిల్లా ఎడ్లపాడు హాస్టల్ కు తరలించారు. అయితే కొద్దీ రోజుల అనంతరం ఖాసీం తన భార్య సహకారంతో బాలికను హాస్టల్ నుంచి మరల ఇంటికి పిలిపించి బాలికను 3 రోజులుగా తన నివాసంలో బంధించి భార్య సహకరంతోనే అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిండుతుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్న గ్రామస్థులు, మహిళా సంఘాలు
Published by:Sulthana Begum Shaik
First published:December 28, 2019, 08:20 IST